అది వారి దురదృష్టం : తమన్నా

0

సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఏ పరిశ్రమలో అయిన ఏ రంగంలో అయినా కష్టపడటంతోనే విజయం రాదు. ఆ కష్టంకు తోడు అదృష్టం కూడా కలిసి రావాలి. అదృష్టంను నమ్ముకుంటూ పని జరుగదు అని అనుకుంటాం కాని పని చేస్తూ ఉన్నా అదృష్టం ఉంటేనే సక్సెస్ దక్కుతుందని సినిమా ఇండస్ట్రీలో పలువురిని చూస్తే అనిపిస్తుంది. ఇతర ఇండస్ట్రీల్లో కంటే సినిమా ఇండస్ట్రీలో అదృష్టం అనేది చాలా కీలకం. అందుకే ఏళ్లకు ఏళ్లు కష్టపడ్డ హీరోయిన్స్ స్టార్ డం దక్కించుకోలేరు – కాని ఒక్క సినిమా హిట్ అవ్వగానే స్టార్స్ అవుతారు. అదృష్టం కొద్ది సక్సెస్ లు దక్కించుకుని స్టార్స్ అయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. తాజాగా తమన్నా పరిస్థితి చూస్తుంటే ఆమె వెంట అదృష్టం ఉన్నట్లుగా అనిపిస్తుంది.

దశాబ్ద కాలం పాటు మంచి హీరోయిన్ గా – స్టార్ డంతో పలువురు స్టార్స్ తో నటించిన తమన్నా రెండేళ్లుగా అవకాశాలు లేక ఇబ్బంది పడుతూ వచ్చింది. తెలుగు తమిళంలో ఆమె కెరీర్ ఖతం అయ్యిందని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా తమిళం మరియు తెలుగులో వరుసగా సినిమాలు చేసే అవకాశం దక్కించుకుంటుంది. ప్రస్తుతం ఆమె చేతిలో అర డజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలు అన్ని కూడా ఆమెకు అదృష్టం ద్వారా వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్ ఉన్నా ఎవరికి ఎవరు పోటీ కాదని తమన్నా చెప్పుకొచ్చింది.

ఇండస్ట్రీలో ఒకరి ఆఫర్లను మరొకరు కొట్టేయడం అనేది సాధ్యం కాదు. ఎవరి ఆఫర్లు వారికే ఉంటాయి. అయితే ప్రతిభ ఉన్నా కూడా ఆఫర్లు రావడం లేదంటే వారి దురదృష్టం. వారు మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తే తప్పకుండా ఏదో ఒక సమయంలో వారికి అదృష్టం కలిసి వచ్చి సక్సెస్ అనేది దక్కుతుందని తమన్నా చెప్పుకొచ్చింది.
Please Read Disclaimer