మాస్ రాజా సరసన మరోసారి మిల్క్ బ్యూటీ..!

0

తమన్నా.. ముంబై నుండి వచ్చిన ఈ మిల్కీ బ్యూటీ. తెలుగు ఇండస్ట్రీలో పాగా వేసి పదేళ్ల 14ఏళ్ల పైనే అయింది. తన డాన్స్ తో నటనతో అద్భుతమైన సినిమా అవకాశాలను అందిపుచ్చుకొని టాప్ హీరోయిన్లలో ఒకటిగా వెలుగుతుంది. ఎల్లప్పుడూ తన అందచందాలతో సినీ అభిమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రస్తుతం సీటిమార్ మహాలక్ష్మి సినిమాలతో బిజీగా ఉంది.

అయితే మాస్ మహారాజ్ రవితేజతో గతంలో ‘బెంగాల్ టైగర్’ సినిమాలో నటించగా సంపత్ నంది ఆ సినిమాకు దర్శకత్వం వహించాడు. మళ్లీ అదే డైరెక్టర్ సినిమా ‘సీటిమార్’ లో ఇప్పుడు నటిస్తుంది. తాజాగా తమన్నా మళ్లీ రవితేజ పక్కన కనిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు సమాచారం. మాస్ రాజా-తమన్నా కాంబినేషన్లో వచ్చిన బెంగాల్ టైగర్ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ అందులో తమన్నా-రవితేజల రొమాన్స్ మాత్రం అదిరిపోయింది. ఇంకా తమన్నా సొగసుల గురించి ఎంత మాట్లాడినా తక్కువే అంటున్నారు అమ్మడి అభిమానులు.

ఇక ప్రస్తుతం రవితేజ ‘క్రాక్’ సినిమా షూటింగులో ఉండగానే తన తదుపరి సినిమా గురించి ప్రకటించిన విషయం తెలిసిందే. మాస్ రాజా నెక్స్ట్ సినిమాను త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నాను ఎంచుకున్నట్లు టాలీవుడ్ లో హాట్ టాపిక్. మరి అదే నిజమైతే ఈసారి స్క్రీన్ మీద రవితేజ-తమన్నాల భీభత్సం మాములుగా ఉండదని భావిస్తున్నారు. ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించనున్నారట.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-