కబడ్డీ కోసం చెమటోడుస్తోంది!

0

వరుసగా క్రేజీ సినిమాలకు సంతకాలు చేస్తూ మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా కంబ్యాక్ అయిన తీరు ఆసక్తికరం. బాహుబలి చిత్రంలో అవంతికగా నటించినా ఎందుకనో ఆ తర్వాత ఊహించని గ్యాప్ వచ్చింది. పలువురు అగ్ర హీరోల సినిమాల్లో నటించినా సరిగా గుర్తింపు దక్కలేదు. ఆ క్రమంలోనే దటీజ్ మహాలక్ష్మి అంటూ లేడీ ఓరియెంటెడ్ మూవీలో ట్రై చేసింది. ఆ సినిమా రిలీజ్ కాకపోవడం చేదు అనుభవం.

ఇలాంటి సందిగ్ధావస్త నుంచి బయటపడే అరుదైన అవకాశం తనకు సైరా నరసింహారెడ్డి రూపంలో లభించింది. ఈ చిత్రంలో లక్ష్మీ పాత్రలో అద్భుత నటనతో మైమరిపించింది. వేదికలపై మెగా బాస్ స్వయంగా తమన్నాని ఆకాశానికెత్తేస్తుంటే మిల్కీ తెగ మురిసిపోతోంది. ఇక ఇదే నూతనోత్సాహంలో ఈ భామ ఎగ్రెస్సివ్ హీరో గోపిచంద్ సరసన నటించేందుకు రెడీ అవుతోంది. రచ్చ – బెంగాళ్ టైగర్ లాంటి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్లకు దర్శకత్వం వహించిన సంపత్ నంది ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆ రెండు సినిమాల్లో తమన్నా .. సంపత్ తో కలిసి పని చేయడం ఆసక్తికరం.

బుధవారం ఈ సినిమాకి హైదరాబాద్ లో ఠెంకాయ కార్యక్రమం పూర్తిచేశారు. ఇందులో తమన్నా ఎలాంటి పాత్ర లో నటించనుంది? అంటే.. చాలా ఆసక్తికర పాత్రలో సరికొత్తగా కనిపించనుందని తెలుస్తోంది. తను కబడ్డీ కోచ్ గా నటిస్తోంది. కబడ్డీ కోచ్ అంటే ఆషామాషీనా? బోలెడన్ని టెక్నిక్ లు లాజిక్ లు తెలియాలి. ప్రోకబడ్డీకి ఫ్యాన్ అయ్యి ఉండాలి. అందుకే ప్రత్యేకించి కోచ్ సమక్షంలో శిక్షణ తీసుకుంటోంది. అందుకోసం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంకి వెళ్లి ఆటను ప్రాక్టీస్ చేస్తోందట. రోజూ రెండు గంటల పాటు హార్డ్ వర్క్ చేస్తోంది. ఒక కోచ్ లా ప్రవర్తించాలంటే ఏం కావాలో తెలుసుకుంటోంది. అయితే ఇలా రోజూ శ్రమిస్తుంటే మిల్కీ దేహశిరి కాస్తా చెమటతో తడిసిపోతోందట.
Please Read Disclaimer