మిల్కీ బ్యూటీ డిజిటల్ డెబ్యూ ‘నవంబర్ స్టోరీ’ టీజర్..!

0

కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల వల్ల ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ బాగా పుంజుకున్నాయి. డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ద్వారా తెలుగు భాషా చిత్రాలు వెబ్ సిరీస్ లు మాత్రమే కాకుండా పరభాషా కంటెంట్ ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త సినిమాలను పలు ఓటీటీలు పోటీపడి కొనుగోలు చేసి డైరెక్ట్ విడుదల చేస్తున్నాయి. అంతేకాకుండా ఓటీటీలు సొంతంగా వెబ్ మూవీస్ ను వెబ్ సిరీస్ లను రూపొందిస్తున్నాయి. సినిమాలతో పోల్చితే డిజిటల్ కంటెంట్ ను అనుకున్న విధంగా చెప్పడమే కాకుండా.. ఫ్లెక్సిబిలిటీ ఎక్కువగా ఉంటుందని భావించి స్టార్ యాక్టర్స్ డైరెక్టర్స్ డిజిటల్ బాట పడుతున్నారు. ఈ క్రమంలో డిస్నీ+హాట్ స్టార్ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రధాన పాత్రలో ”నవంబర్ స్టోరీ” అనే వెబ్ సిరీస్ రూపొందించింది.

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న తమన్నా.. ‘నవంబర్ స్టోరీ’ వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ తమిళ్ సిరీస్ కి రామ్ సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించాడు. తాజాగా తమన్నా తన డెబ్యూ వెబ్ సిరీస్ ని ప్రకటిస్తూ దీనికి సంబంధించిన టీజర్ ని సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేసింది. టీజర్ చూస్తుంటే ఇదొక క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ అని అర్థమవుతోంది. గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురవ్వడం.. ఈ హత్యకు దేశంలో ప్రసిద్ధ క్రైమ్ నవలా రచయిత అయిన తమన్నా తండ్రికి సంబంధం ఉందా అనే అనుమానాలు రేకెత్తినట్లు టీజర్ లో చూపించారు. ఆ హత్యకు తమన్నా తండ్రికి సంబంధం ఏమిటి? వారు ఈ మిస్టరీ మర్డర్ నుండి బయటపడ్డారా లేదా? ఆ హత్య తమన్నా తండ్రే చేశాడా? అనే అనుమానాలు కలిగిస్తోంది. ఈ సిరీస్ లో తమన్నా తండ్రి పాత్రలో జిఎమ్.కుమార్ కనిపిస్తున్నాడు. ఏదేమైనా తమన్నా డిజిటల్ డెబ్యూ కోసం కంటెంట్ ఆధారిత పాత్రను ఎంచుకుందని తెలుస్తోంది. ‘నవంబర్ స్టోరీ’ వెబ్ సిరీస్ తమిళంలో రూపొందినప్పటికీ తెలుగులో అనువాదం చేయనున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన ‘నవంబర్ స్టోరీ’ సిరీస్ త్వరలోనే డిస్నీ + హాట్ స్టార్ లో ప్రసారం కానుంది.