మిల్కీ బ్యూటీ తడిపొడి కవ్వింత దేనికో!

0

పాల నురుగు శిరులతో కుర్రకారును కవ్వించే అందాల భామ తమన్నా భాటియా. అందచందాలతో పాటు నటన.. డ్యాన్సులతోనూ భారీగా అభిమానులకు కొంగున కట్టేసుకుంటుంది. 2019 ఈ అమ్మడికి కలిసొచ్చిన సంవత్సరం. అయితే 2020 లో మాత్రం ఆశించినంత జోరు కనిపించ లేదు. ఆ క్రమంలోనే సోషల్ మీడియాలో అభిమానులతో టైమ్ పాస్ చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్ స్ట్రాగామ్ లో అదిరిపోయే ఫొటోను అప్ డేట్ చేసింది. ఇది సోషల్ మీడియాను షేక్ చేస్తోందని నెటిజనులు అంటున్నారు. కొంటె చూపులతో సూదంటు రాయిని గురి చూసి కుర్రకారు గుండెల్లో సూటిగా గుచ్చేస్తోంది మిల్కీ. చేతిలో కాఫీ కప్ తో బోయ్స్ ని ఊహాలోకంలోకి విసిరేస్తోంది ఈ అప్సరస. నీలి రంగు బాత్ టబ్లో నేపాల్ బ్రాండ్ కండువా చుట్టుకుని ఉన్న తమన్నా భంగిమ చూసినవారి మతిపోతోందని యువత బహిరంగంగానే కామెంట్లు పెట్టేస్తున్నారు.

దక్షిణాదిలో మోస్ట్ వాంటెండ్ నటిగా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఏ విషయాన్ని అయినా వెంటనే అభిమానులతో పంచుకోవడానికి ఆసక్తి చూపుతుంది. తమన్నా భాటియా ఈ ఏడాది సినిమాల విషయంలో వెనకబడినా.. ఏదో ఒక టాపిక్ తో ఇలా టచ్ లోకి వస్తూనే ఉంది.

ఇదివరకే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మిల్కీ సోయగం తాజాగా నవాజుద్దీన్ సిద్దికీ సరసన బోలే చుడియన్ లో నటించింది. కొంత గ్యాప్ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రానికి షమాస్ నవాబ్ సిద్దిక్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం గోపిచంద్ కథానాయకుడిగా సంపత్ నంది తీస్తున్న చిత్రంలో తమన్నా నటిస్తున్నారు. గత ఏడాది మెగాస్టార్ నటించిన సైరా నరసింహారెడ్డి లో చక్కని పాత్రతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో తమన్నా నటనకు చిరు సైతం ఫిదా అయ్యారు. ఇక నిరంతరం ఎట్రాక్షన్ కోసం ఇన్ స్ట్రాగామ్ లో తమన్నా ఇలా కొత్త ట్రీట్ ప్లాన్ చేయడం వెనక ఇంకేం గేమ్ ప్లాన్ ఉందో చూడాలి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-