సత్తా చాటుకునే అవకాశం దక్కించుకున్న తమన్నా

0

మిల్కీ బ్యూటీ తమన్నా పుష్కర కాలం పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. టాలీవుడ్ లోని దాదాపు స్టార్ హీరోలందరితో కూడా ఈ అమ్మడు నటించేసింది. గత సంవత్సర కాలంగా ఈ అమ్మడికి అవకాశాలు తగ్గాయి. టాలీవుడ్ నుండి కోలీవుడ్ వెళ్లి ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఈమెకు సరిగా ఛాన్స్ లు దక్కడం లేదు. దాంతో ఈ అమ్మడు వెబ్ సిరీస్ లో నటించేందుకు ఓకే చెప్పిన విషయం తెల్సిందే. పలువురు స్టార్స్ వెబ్ సిరీస్ ల బాట పడుతున్న సమయంలో తమన్నా కూడా వెబ్ సిరీస్ లకు సిద్దం అయ్యింది.

రాక్షసన్ చిత్రంతో తమిళంలో సూపర్ హిట్ దక్కించుకున్న దర్శకుడు రామ్ కుమార్ వద్ద చాలా కాలంగా అసిస్టెంట్ గా చేసి రాక్షసన్ చిత్రం స్క్రీన్ ప్లే రచనలో కీలక పాత్ర పోషించిన రామ్ సుబ్రమణ్యన్ దర్శకత్వంలో తమన్నా ఈ వెబ్ సిరీస్ ను చేయబోతుంది. చాలా ఆసక్తికరమైన స్టోరీ లైన్ తో ఈ వెబ్ సిరీస్ రూపొందబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. తన తండ్రి ఎదుర్కొంటున్న తప్పుడు కేసులను ఒక కూతురు ఎలా ఎదుర్కొంది.. చట్టంతో ఎలా పోరాడి తండ్రిని కాపాడుకుంది అనే కాన్సెప్ట్ తో ఈ వెబ్ సిరీస్ రూపొందబోతుందట.

ఆ కూతురు పాత్రలో తమన్నా నటించబోతుంది. ఒక సామాన్యమైన అమ్మాయిగా తమన్నా కనిపించబోతుంది. నటనకు చాలా స్కోప్ ఉన్న పాత్ర అవ్వడంతో తమన్నా ఆ పాత్రను ఛాలెంజింగ్ గా తీసుకుని మరీ నటించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన తమన్నా నటిగా కొన్ని సినిమాల్లో మాత్రమే మెప్పించింది. మళ్లీ ఇప్పుడు నటిగా మరోసారి మెప్పించి హీరోయిన్ గా ఛాన్స్ లు దక్కించుకునేందుకు తమన్నా ప్రయత్నాలు చేస్తుంది. నటనకు ఆస్కారం ఉన్న పాత్ర అవ్వడం వల్లే తమన్నా వెబ్ సిరీస్ కు ఓకే చెప్పిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
Please Read Disclaimer