‘భాగమతి’ రీమేక్ లో మిల్కీబ్యూటీ?

0

మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా దశాబ్ధం పైగానే సౌత్ స్టార్ హీరోయిన్ గా కెరీర్ ని సాగిస్తోంది. మిల్కీ లైఫ్ టర్న్ గురించి తెలిసిందే. సంచలనాల బాహుబలి సిరీస్ లో నటించిన తమన్నా ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ `సైరా` చిత్రంలోనూ నటించింది. ఈ రెండు భారీ ప్రాజెక్టుల మధ్యలో పలు కమర్షియల్ చిత్రాల్లోనూ నటించి విజయాలు అందుకుంది. 2019 సంక్రాంతికి రిలీజైన ఎఫ్ 2 తమన్నా కెరీర్ లోనే నాన్ బాహుబలి కేటగిరీలో బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. క్వీన్ రీమేక్ `దటీజ్ మహాలక్ష్మి` లోనూ తమన్నా కథానాయికగా నటించింది. ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది.

మరోవైపు తెలుగు తమిళంలో వరుసగా కథలు వింటోంది. కానీ వేటికీ సంతకాలు మాత్రం చేయడం లేదు. ఇటీవలే గోపిచంద్ సరసన అవకాశం వస్తే కాదనుకుంది. అలాగే `రాజుగారి గది 3` ఛాన్స్ కూడా వదులుకుని ఆశ్చర్యపరిచింది. తన పాత్ర పరిధి నచ్చకపోతే వెంటనే ఎలాంటి ప్రాజెక్ట్ అయినా వదులుకుంటోంది. అయితే మిల్కీ ఇలా చేయడానికి ప్రత్యేక కారణం ఏదైనా ఉందా? అంటే రకరకాల సందేహాలు కలగక మానవు.

మిల్కీ మైండ్ సెట్ ఇటీవల పూర్తిగా మారింది. లేడీ ఓరియెంటెడ్ కథాంశాల్లో నటించాలనే ఇలా ఆ రెండిటినీ వదులుకుందన్న ముచ్చటా సాగుతోంది. ఇటీవల పిల్ల జమీందార్ ఫేం అశోక్ ఓ లేడీ ఓరియెంటెడ్ కథాంశాన్ని తమన్నాకి వినిపించారట. అది తెలుగు బ్లాక్ బస్టర్ `భాగమతి` తమిళ రీమేక్ ప్లాన్ అని చెబుతున్నారు. అయితే ఆ సినిమాకి తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఈ చిత్రానికి సంతకం చేస్తే తమన్నా ఆలోచన ఏంటో అర్థమైపోయినట్టే. పెట్రోమ్యాక్స్-బోలే చుడియాన్-యాక్షన్ అనే చిత్రాలకు తమన్నా సంతకాలు చేసింది. ఇక మునుముందు నయనతార-త్రిష-కాజల్ తరహాలోనే తన పాత్రకు ప్రాధాన్యతను.. లేదా లేడీ ఓరియెంటెడ్ అయితేనే అంగీకరిస్తుందని సీన్ చెబుతోంది.
Please Read Disclaimer