మహేష్ తో మిల్కీ బ్యూటీ

0

తన సినిమాల్లో నటించిన కథానాయికలను అతిధి పాత్రలకో లేక ఐటమ్ నంబర్లకో ఒప్పించడం అనీల్ రావిపూడి పద్ధతి. అది అతడికి సెంటిమెంట్. సుప్రీం సినిమా నుంచి ఇది కొనసాగిస్తున్నారు. ఈసారి కూడా ఈ సెంటిమెంట్ రిపీటవుతోంది. బ్లాక్ బస్టర్ మూవీ ఎఫ్ 2లో నటించిన మిల్కీ బ్యూటీని అనీల్ రిపీట్ చేస్తున్నాడు. అతడు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `సరిలేరు నీకెవ్వరు`లో తమన్నా ఐటెమ్ నంబర్ చేయనుందని గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది.

అయితే తమన్నా చేస్తున్నది ఐటమ్ నంబర్ కాదు. ఓ అతిధి పాత్రలో తళుక్కుమనబోతోందని తెలుస్తోంది. డిసెంబర్ లో సరిలేరు చిత్రబృందంతో తమన్నా జాయిన్ అవుతుందట. ఇప్పటికే ఈ సినిమా మెజారిటీ భాగం చిత్రీకరణ పూర్తయింది. సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ చేయనున్నారు. డిసెంబర్ లో ప్రతి సోమవారం మాస్ ఎంబీ సాంగ్స్ తో ప్రచారానికి అనీల్ రావిపూడి టీమ్ ప్లాన్ చేస్తోంది.

ఈ చిత్రంలో రష్మిక మందన కథానాయికగా నటిస్తోంది. మహేష్ పాత్రకు ధీటుగా ఆసక్తి రేకెత్తించే పాత్రలో రష్మిక కనిపించనుందని …తన పాత్ర హైలైట్ గా వస్తోందని చెబుతున్నారు. మరోవైపు మహేష్ కి ధీటుగా ప్రొఫెసర్ భారతి పాత్రలో విజయశాంతి మెరిపించనున్నారు. ఇక ఇలాంటి టాప్ స్టార్లతో మిల్కీ చేరికతో మరింత గ్లామర్ పెరగనుంది. మహేష్ నటించిన ఆగడు చిత్రంలో తమన్నా కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.
Please Read Disclaimer