ఉలి వేసి చెక్కిన పాల రాతి శిల్పం

0

మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా గురించి చెప్పాల్సిన పనేలేదు. దశాబ్ధం పైగానే సౌత్ ఇండస్ట్రీని అగ్ర కథానాయికగా ఏల్తోంది. ఒడిదుడుకులు ఎదురైనా తెలివైన ఎంపికలతో కంబ్యాక్ అవ్వడం ఎలానో ఈ అమ్మడిని చూసి నవతరం నేర్చుకోవాలి. ఇక కేవలం అందం తెలివితేటలేనా? అంటే… ఫ్యాషన్ అన్న యాంగిల్ లోనూ మిల్కీ ఎందరికో స్ఫూర్తి.

తాజాగా ఈ అమ్మడికి సంబంధించిన ఓ కొత్త లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్టైలిస్ట్ కం డిజైనర్ సుకృతి గ్రోవర్ ఈ ఫోటోని షేర్ చేశారు. ఈ లుక్ చూశాక.. మిల్కీ బ్యూటీని డిజైనర్లు ఒక శిల్పంలా తీర్చిదిద్దారనే ప్రశంసించి తీరాలి. వయోలెట్- బూడిద రంగు మిక్స్ చేసిన ఈ స్పెషల్ డిజైనర్ డ్రెస్ లో హాలీవుడ్ పాప్ స్టార్లనే తలదన్నేంత అందంగా కనిపిస్తోంది మిల్కీ. నిఖిల్ తంపి ఈ ఔట్ ఫిట్ ని అందించారు. ఆ ఎత్తుమడమల చెప్పుల్ని రూపొందించింది కేస డియో.. టీనా ముఖర్జీ ఆ స్పెషల్ హెయిర్ స్టైల్ ని డిజైన్ చేశారు. నిక్కీ రజని మేకప్ ని అందించారు. మొత్తానికి ఇంతమంది కృషితో మిల్కీ అందం మరింతగా మెరుపులు విరజిమ్ముతోంది. అంత అందమైన ఆ డిజైనర్ డ్రెస్ ని సైతం ఆ పాలనురుగు దేహం డామినేట్ చేసేసింది అంటే అతిశయోక్తి కాదు.

ఇటీవల వరుసగా క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది తమన్నా. సైరా నరసింహారెడ్డి- యాక్షన్ వంటి భారీ చిత్రాల్లో నటించింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రేయసిగా నటించి మెగాభిమానుల మెప్పు పొందింది. ఆ వెంటనే విశాల్ సరసన యాక్షన్ చిత్రంలోనూ ఇంపార్టెంట్ పాత్రలో నటించింది. ఆర్మీ లో రా వింగ్ లేడీ కమాండర్ గా తమన్నా నటననపై అద్భుత ప్రశంసలు దక్కాయి. సుందర్ సి నెవ్వర్ బిఫోర్ అన్నంతగా మిల్కీ అందచందాల్ని తెరపై ఆవిష్కరించారని యూత్ మాట్లాడుకోవడం విశేషం.
Please Read Disclaimer