ముద్దు విషయంలో మార్పు లేదన్న మిల్కీబ్యూటీ

0

ఈమద్య కాలంలో హీరోయిన్స్ ముద్దు సీన్స్ విషయంలో అస్సలు మొహమాట పడటం లేదు. కమర్షియల్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకోవాలంటే ఖచ్చితంగా ముద్దు సీన్స్ చేయడంతో పాటు స్కిన్ షో చేయాల్సిందే. ఈ విషయం ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో ఫాలో అవ్వాలి. కాని తమన్నా మాత్రం ఇప్పటి వరకు ముద్దు సీన్స్ చేయకుండానే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది. స్కిన్ షో విషయంలో ఎప్పుడు కూడా అడ్డు చెప్పని తమన్నా ముద్దు సీన్ విషయానికి వచ్చేప్పటికి నో అంటే నో అంటుంది.

కెరీర్ ఆరంభించి పుష్కర కాలం అయినా కూడా తమన్నా మాత్రం ముద్దులకు హద్దులు పెడుతూనే ఉంది. ఈమద్య కాలంలో ఈమెకు సక్సెస్ లేకపోవడంతో అవకాశాలు కూడా తగ్గాయి. వస్తున్న అడపా దడపా ఛాన్స్ లనైనా వినియోగించుకుని మళ్లీ బిజీ అవ్వాలని ఆమె ప్రయత్నిస్తుంది. ఈ సమయంలో కూడా ఆమె తన ముద్దు పాలసీని పక్కకు పెట్టవద్దని నిర్ణయించుకుంది. ఇటీవల ఈమె ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి తన ముద్దు లిమిట్స్ పై క్లారిటీ ఇచ్చింది.

నేను 13వ సంవత్సరంలో ఉన్నప్పటి నుండి నటిస్తున్నాను. అప్పటి నుండి కూడా నాకు ముద్దు సీన్స్ అంటే ఇష్టం లేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ముద్దు సీన్స్ విషయంలో నా అభిప్రాయం మారలేదు. ఇకపై కూడా నేను ముద్దు సీన్స్ లో నటించాలనుకోవడం లేదు. గ్లామర్ గా నటించేందుకు ఓకే కాని ముద్దు సీన్స్ చేయాలంటే మాత్రం తనవల్ల కాదని చెప్పేసింది. ఇటీవల ఈమె నటించిన ‘సైరా’ చిత్రంతో మంచి గుర్తింపు దక్కించుకుంది. తమిళం మరియు తెలుగులో ఈమె మళ్లీ బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Please Read Disclaimer