చిరంజీవిగారితో నటించాను.. ఇక ధన్యం!- మిల్కీ

0

మెగాస్టార్ చిరంజీవి నటించిన హిస్టారికల్ వారియర్ చిత్రం `సైరా-నరసింహారెడ్డి`. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కొద్ది సేపటి క్రితం రిలీజైన టీజర్ మెగాభిమానులు సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీఅభిమానుల్లోకి దూసుకెళ్లిపోతోంది. సాహో తర్వాత అంతే ఛాలెంజింగ్ విజువల్స్ తో వస్తున్న సినిమాగా `సైరా` టీజర్ నమ్మకం పెంచింది. ఈ సినిమా ఎలా ఉండబోతోంది? అన్నది ఈ టీజర్ తో ఇంతకుముందు విడుదలైన మేకింగ్ వీడియోతో స్పష్ఠత వచ్చేసింది. నాన్న(చిరంజీవి)గారికి ముందే ప్రామిస్ చేసినట్టే రామ్ చరణ్ అద్భుతమైన గిఫ్ట్ ని రెడీ చేస్తున్నారని అర్థమవుతోంది.

నేడు బాలీవుడ్ ఆడియెన్ కోసం `సైరా-నరసింహారెడ్డి` హిందీ టీజర్ ని ముంబైలో లాంచ్ చేశారు. బాలీవుడ్ మీడియా నుంచి దీనికి అద్భుత స్పందన వచ్చింది. ఇక ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి సహా చిత్రయూనిట్ పై ముంబై మీడియా ప్రశ్నల వర్షం కురిపించింది. కొన్ని ప్రశ్నలు ఈ చిత్రంలో ఓ ఇంపార్టెంట్ పాత్రలో నటిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నాపైనా సంధించారు. వాటికి మిల్కీ ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది.

తమన్నా మాట్లాడుతూ.. “ఈ చిత్రంలో నేను చేసిన పాత్ర చాలా క్లిష్టమైనది. ఇంతకుముందు హిస్టారికల్ నేపథ్యంలో నేను చేసిన సినిమా(బాహుబలి) వేరు. ఇది వేరు. సైరాతో నా పేరు వినిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు సురేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. నేను ఇంతకుముందు ఆయనతో పని చేశాను. ప్రతిసారీ ఏదో ఒక వైవిధ్యం ఉన్న పాత్రలో అవకాశం ఇచ్చారు. నేను సౌత్ లో నటించడం మొదలైనప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో నటించాలని అనుకునేదానిని. ఇప్పటికి ఆ కల నెరవేరింది. చిరంజీవిగారితో నటించిన ఆ క్షణాన్ని ఎంతో హ్యాపీగా ఫీలవుతున్నా“ అని అన్నారు. బాహుబలి చిత్రంలో అవంతికగా హిందీ ప్రేక్షకులకు తమన్నా సుపరిచితం. అందుకే ఇప్పుడు సైరాలో నటిస్తోంది అనగానే అన్నిచోట్లా మీడియా జనం తమన్నాపై దృష్టి కేంద్రీకరిస్తున్నారని అర్థమవుతోంది. ఇక చిరంజీవి సరసన అవకావం వచ్చింది అంటే జన్మ ధన్యం అయ్యిందనే. ఎట్టకేలకు తమన్నా కల నెరవేరినందుకు ఎంతో ఎగ్జయిట్ అవుతోంది.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home