ముంబై ఇల్లు సీక్రెట్ చెప్పిన మిల్కీ!

0

మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా కెరీర్ జర్నీ గురించి తెలిసిందే. వరుసగా సినిమాలు రిలీజవుతున్నా సక్సెస్ దక్కడం లేదు. ఇటీవలే రిలీజైన అభినేత్రి 2.. కామోషీ (హిందీ) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లు గా నిలిచాయి. ఎన్నో హోప్స్ పెట్టుకున్న క్వీన్ రీమేక్ `దటీజ్ మహాలక్ష్మి` రిలీజ్ కి రాకపోవడం నిరాశపరుస్తోంది. మెగాస్టార్ `సైరా నరసింహారెడ్డి` చిత్రంలో తమన్నా ఓ ఆసక్తికర పాత్రలో నటించింది. అలాగే సుందర్ సి దర్శకత్వంలో ఓ సినిమా.. ఆనందో బ్రహ్మ హిందీ రీమేక్ కి సంతకం చేసిందని వార్తలొచ్చాయి. కెరీర్ తో పాటు లైఫ్ లో సెటిలయ్యేందుకు తమన్నా ఒక్కో అడుగు వేస్తోందన్నది తాజా అప్ డేట్.

అందుకే కెరీర్ జోరు మీద ఉన్నప్పుడే ఈ అమ్మడు ఓ ఇంటిది అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. అంటే పెళ్లి చేసుకుని సెటిలవ్వాలని ఆలోచిస్తోందా? అంటే అదేమీ కాదు. ముంబైలో సొంతంగా ఓ ఖరీదైన అపార్ట్ మెంట్ ని కొనుక్కుంది తమన్నా. ముంబై సెలబ్రిటీలంతా నివశించే ఖరీదైన ఏరియాలో ఓ భారీ భవంతిలోని 14వ అంతస్థులో అద్భుతమైన బీచ్- వ్యూ ఉండేలా ఫ్లాట్ ని ఎంపిక చేసుకుంది. దాదాపు ఎనిమిది వేల చదరపు అడుగుల్లోని ఈ అపార్ట్ మెంట్ కోసం తమన్నా ఏకంగా 16 కోట్ల 60 లక్షలు చెల్లించిందిట. అయితే ఈ ఇంటి కోసం తమన్నా బిల్డర్ కి రెట్టింపు మొత్తాన్ని చెల్లించిందని ప్రచారమైంది.

ఈ ప్రచారం నిజమా? అని ప్రశ్నిస్తే ఇటీవల ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు సంగతిని చెప్పింది తమన్నా. ముంబైలో ఇల్లు కొన్నది నిజమే. కానీ డబుల్ రేట్ ఇచ్చి కొనుక్కున్నానని వచ్చిన వార్తలు అవాస్తవమని తెలిపింది. అంత రేటు పెట్టి కొన్నానని వచ్చిన వార్తల్ని నా స్కూల్ టీచర్ నాకు చెప్పారు. “నేను సింధీ.. ఎందుకు డబుల్ రేటు ఇచ్చి అపార్ట్ మెంట్ కొంటాను?“ అని నేను మా టీచర్ కి రిప్లయ్ ఇచ్చాను.. అని తమన్నా తెలిపింది. “ఇల్లు కొన్నది నిజమే. కానీ డబుల్ పేమెంట్ చెల్లించలేదు. నేను మా అమ్మా నాన్నలతో కలిసి ఆ అపార్ట్ మెంట్ లోకి వెళతాను. అయితే ఇంకా ఇల్లు రెడీ కావాల్సి ఉంది. నేను సింపుల్ గా ఉండేందుకు ఇష్టపడతాను. ఇంటిని కళాత్మకంగా .. నేచురల్ ఎర్తీ లుక్ లో ఉండేలా తీర్చిదిద్దుతున్నా“ అని తమన్నా తెలిపారు.
Please Read Disclaimer