సైరా : లక్కీ తమన్నా

0

మెగా ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా కూడా ఎప్పుడెప్పుడ అంటూ ఎదురు చూసిన ‘సైరా నరసింహారెడ్డి’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగా ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా సినిమా పట్ల పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. సినిమాకు మంచి టాక్ రావడంతో రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అంటూ మెగా ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సినిమాతో హీరోయిన్ తమన్నా కూడా చాలా సంతోషంగా ఉంది. కారణం ఈమె కెరీర్ కు సైరా జీవం పోసినట్లయ్యింది.

ఈమద్య కాలంలో తెలుగులో ఈమెకు పెద్దగా ఆఫర్లు లేవు. సైరాలో కూడా మొదట ఒక చిన్న పాత్ర అనుకున్నారు. విడుదలకు ముందు వరకు కూడా సైరా చిత్రంలో తమన్నాది చిన్న పాత్ర అని.. వేశ్యగా కొద్ది సమయం కనిపించనుందని ప్రచారం జరిగింది. నయనతార ప్రమోషన్స్ కు హాజరు కాకపోవడంతో ఆమె బదులు చిన్న పాత్రనే చేసిన తమన్నాను ప్రమోషన్స్ లో యాక్టివ్ గా చేశారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. కాని సినిమా విడుదలైన తర్వాత తమన్నా పాత్రకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించిన నయనతార కంటే కూడా అధికంగా తమన్నాకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ దక్కడంతో పాటు ఆమెకు క్లైమాక్స్ లో మంచి సీన్స్ పడ్డాయని సినిమా చూసిన ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమన్నా డాన్స్ మరియు నటనతో సినిమాకు ప్లస్ అయ్యిందని.. ఖచ్చితంగా ఈ చిత్రం ఆమె కెరీర్ మరికొంత కాలం సాగేలా చేసిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమన్నా కెరీర్ లో ఇది మరో నిలిచి పోయే సినిమా అవుతుందని అంటున్నారు. మొత్తానికి ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ పాత్ర దక్కినా కూడా తమన్నా లక్కీ అనుకోవచ్చు.
Please Read Disclaimer