సైరా.. తమన్నాపై వచ్చినవి గాసిప్పులేనట!

0

ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పదిహేనేళ్ళు అవుతున్నా ఇంకా హీరోయిన్ గా కొనసాగుతూ మిల్కీ బ్యూటీ తమన్నా అందరినీ సర్ ప్రైజ్ చేస్తోంది. తమన్నా చేతిలో ప్రస్తుతం నాలుగైదు సినిమాలు ఉన్నాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ హిస్టారికల్ చిత్రం ‘సైరా’ కూడా ఉంది. ఈ సినిమాలో తమన్నా ఒక నెగెటివ్ షేడ్స్ ఉండే పాత్రలో నటిస్తోందని ఈమధ్య వార్తలు వచ్చాయి.

కానీ తాజా సమాచారం మేరకు తమన్నా ‘సైరా’ లో ఎటువంటి నెగెటివ్ షేడ్స్ ఉండే పాత్రలో నటించడం లేదట. మరి ఏ పాత్రలో నటిస్తోందనే వివరాలు మాత్రం బైటకు పొక్కకుండా ‘సైరా’ టీమ్ జాగ్రత్త వహిస్తున్నారు. అయితే ఈ సినిమాలో తమన్నా పాత్ర మాత్రం కీలకమైనదని సమాచారం. ‘సైరా’ లో నయనతార మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సతీమణి పాత్రలో నయన్ నటిస్తోంది.

ఇదిలా ఉంటే తమన్నాకు ఒక ప్రత్యేకత ఉంది.. అటు తనయుడు రామ్ చరణ్ తోనూ.. ఇటు తండ్రి చిరంజీవితోనూ కలిసి నటించిన అతి తక్కువమంది హీరోయిన్లలో తమన్నా ఒకరు. గతంలో కాజల్ అగర్వాల్ ఈ ఫీట్ సాధించింది.