నారా లోకేశ్ పై పోటీ చేసిన హిజ్రా ఇప్పుడు బిగ్ బాస్ లో

0

మొన్నటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి అసెంబ్లీకి పోటీ పడిన మాజీ మంత్రి నారా లోకేశ్ వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో మంగళగిరి నుంచే ఓ హిజ్రా ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. సింహాద్రి అలియాస్ తమన్నా అనే ఈ హిజ్రా ఇప్పుడు బుల్లితెర షో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమెను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించారు.

తొలి వారం పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షోలో మొత్తం 15 మంది పోటీదారుల్లో రెండో రోజే ఆరుగురు సభ్యులు రాహుల్ – పునర్నవి – వితికా శెరు – హిమజ – జాఫర్ – హేమలు ఎలిమినేషన్ రౌండ్ కు నామినేట్ అయ్యారు. వీరిలో నటి హేమ ఆదివారం షో నుంచి ఎలిమినేట్ అయింది. అయితే ఆ వెంటనే హోస్ట్ నాగార్జున హౌస్ మేట్స్ కు సర్ ప్రైజ్ ఇస్తూ హిజ్రా తమన్నాను లోనికి తీసుకొచ్చారు.

విజయవాడలో పుట్టిపెరిగిన తమన్నా ట్రాన్స్ జెండర్. మంగళగిరిలో నారా లోకేశ్ పై పోటీ చేసినప్పుడు ఎన్నికల అఫిడవిట్ లో తన పేరును సింహాద్రి తమన్నాగా పేర్కొన్నారు. వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలనే ఉద్దేశంతోనే మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నట్లు అప్పట్లో ఆమె చెప్పారు. తాను జనసేన నుంచి పోటీ చేయాలనుకున్నానని.. కానీ ట్రాన్స్జెండర్ కావడంతో జనసేనలో తనకు టికెట్ రాకుండా వివక్ష చూపారని తమన్నా అప్పట్లో ఆరోపించారు. జనసేనలో క్రీయాశీలకంగా పనిచేసినా కనీసం పవన్ కల్యాణ్ ను కలిసే అవకాశం కూడా ఇవ్వలేదని ఆమె అన్నారు. ఇప్పుడు బిగ్ బాస్ లో వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీల మధ్య ఆమె ఎలా నడుచుకుంటారు.. బిగ్ బాస్ షో ఫైనల్ వరకు వెళ్తారా.. లేదంటే మధ్యలోనే ఎలిమినేట్ అవుతారా.. చివరి వరకు నిలిచి బిగ్ బాస్ గా నిలుస్తారా చూడాలి.
Please Read Disclaimer