ఎంట్రీతోనే గ్రూపు పెట్టేసిన తమన్నా!

0

తొలివారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన నటి హేమ స్థానంలో ట్రాన్స్ జెండర్ తమన్నా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేశారు. వారం లేటుగా హౌస్ లోకి వెళ్లిన నేపథ్యంలో.. అప్పటికే టెలికాస్ట్ అయిన బిగ్ బాస్ ఎపిసోడ్ లను చూసిన నేపథ్యంలో తనకంటూ పక్కా ప్లాన్ తో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినట్లుగా వ్యవహరించారు.

వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఇంట్లోకి వచ్చిన తమన్నా.. కొందరిని టార్గెట్ చేసినట్లుగా కనిపించింది. ఆ మధ్యన వరుణ సందేశ్ – మహేశ్ మధ్య జరిగిన లొల్లి తెలిసిందే. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ టైంలో తాను ఇంట్లో ఉండి ఉంటే తాను మహేశ్ కు సపోర్ట్ చేస్తానని చెప్పటం.. మహేశ్ ను చీప్ మెంటాల్టీ అనటం తనకు నచ్చలేదని చెప్పారు. ఈ విషయాన్ని ఒకరిద్దరితో కాకుండా.. బాబా భాస్కర్.. జాఫర్.. మహేశ్.. అలీరెజా..శ్రీముఖిలతో చెప్పటం చూస్తే.. హౌస్ లో జట్టు కట్టాలన్న ఆలోచనలో తమన్నా ఉన్నట్లు కనిపించక మానదు.

ఇదే విషయాన్ని గుర్తించినట్లుగా వరుణ్ సందేశ్ మాటలు స్పష్టం చేస్తాయి. తమన్నా రావటంతోనే ఒక గేమ్ ప్లాన్ తో వచ్చినట్లుగా వరుణ్ వ్యాఖ్యానించటంతో పాటు.. తనకు మహేశ్ కు గొడవ పెట్టాలని తమన్నా చూస్తుందని రాహుల్ తో వరుణ్ చెప్పటం గమనార్హం. వైల్డ్ కార్డు ఎంట్రీతో వచ్చిన తమన్నా.. హౌస్ లో జరిగిన విషయాలపై తనకున్న అవగాహనను చెప్పేయటంతో పాటు.. ఒక జట్టు కట్టటం ద్వారా హౌస్ లో చిత్రమైన కాంబినేషన్ ను తయారు చేయాలన్నట్లుగా ఉందని చెప్పాలి.

అంతేకాదు.. ఎలిమినేషన్ విషయంలోనూ వారిద్దరూ కలిసి ఒక గేమ్ ఆడుతున్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అందుకే వారిద్దరిలో ఒకర్ని ఎలిమినేట్ చేసేందుకే తాను ఇద్దర్నీ నామినేట్ చేస్తున్నట్లు చెప్పింది. మొత్తానికి వైల్డ్ కార్డు ఎంట్రీతో ఇంట్లోకి అడుగు పెట్టిన తమన్నా పుణ్యమా అని హౌస్ లో గ్రూపులు ఏర్పాటుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పక తప్పదు.
Please Read Disclaimer