సరిలేరు ప్రీ రిలీజ్ ఈవెంట్.. స్పెషల్ ఇదే

0

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ మరో వారంలోపే ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం జరుగనుంది. హైదరాబాద్ లోని ఎల్ బీ స్టేడియంలో జరగనున్న ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. దీంతో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ రోజు కార్యక్రమంలో ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ అంతా పాల్గొంటుంది. ఈరోజు ఈవెంట్ లో హైలైట్ ఏంటంటే మిల్కీ బ్యూటీ తమన్నా లైవ్ పెర్ఫార్మెన్స్. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో తమన్నా ‘డాంగ్ డాంగ్’ పాటకు మహేష్ తో కలిసి స్టెప్పులు వేసిన సంగతి తెలిసిందే. ఈ పాటలో మహేష్ – తమన్నా స్టెప్పులు అందరినీ ఆకర్షించాయి. డాంగ్ డాంగ్ పాట ప్రోమోకు ఇప్పటివరకూ 8 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈరోజు జరగబోయే ఈవెంట్ లో తమన్నా ఈ పాటకు డ్యాన్స్ వేస్తే స్టేడియం అరుపులతో కేకలతో హోరెత్తడం ఖాయం.

ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. విజయశాంతి.. ప్రకాష్ రాజ్.. రావు రమేష్.. వెన్నెల కిషోర్.. సంగీత.. హరితేజ.. రాజేంద్ర ప్రసాద్.. నరేష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.
Please Read Disclaimer