సవ్యసాచితో తమన్నా లగ్గాయిత్తు

0‘నిన్ను రోడ్డు మీద చూసినాది లగ్గాయిత్తు’ అంటూ అల్లరి అల్లుడు మూవీలో నాగార్జున పాడిన పాట.. చేసిన అల్లరి మామూలుగా ఉండదు. రమ్యకృష్ణతో కలిసి నాగ్ పాడుకున్న ఈ పాట.. ఇప్పటికీ ఆకట్టుకునేంత స్టామినాను కలిగి ఉంటుంది. అందుకే.. ఈ లగ్గాయిత్తు పాటను రీమిక్స్ చేసేందుకు రెడీ అయిపోయాడు నాగ చైతన్య.

సవ్యసాచి అంటూ చందూ మొండేటి దర్శకత్వంలో.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతున్న మూవీలో “నిన్ను రోడ్డు మీద’ పాటను రీమిక్స్ చేయబోతున్నారు. ఒరిజినల్ ను కంపోజ్ చేసిన ఎంఎం కీరవాణి.. ఈ రీమిక్స్ వెర్షన్ కు కూడా సంగీతం అందిస్తుండం విశేషం. ఈ పాటలో చైతుతో కలిసి డ్యాన్స్ చేసేందుకు.. స్టార్ హీరోయిన్ ను ఎంచుకోవాలని ఫిక్స్ అయిన టీం.. చివరకు మిల్కీ బ్యూటీ తమన్నాకు సెట్ అయ్యారట. ఇప్పటికే తమ్మూను అడగడం.. ఆమె వెంటనే ఓకే చెప్పేయడం కూడా జరిగిపోయాయని తెలుస్తోంది.

మిల్కీ ఎంట్రీ కారణంగా.. సవ్యసాచిలో ఈ పాటకు మరింతగా అట్రాక్షన్ చేకూరడం ఖాయంగా చెప్పవచ్చు. ఐటెం సాంగ్ ఫార్మాట్ లో ఈ పాట వచ్చే అవకాశాలు ఉండగా.. ఈ నెలాఖరులో సాంగ్ షూట్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. కొన్ని ఖరీదనైన సెట్స్ ను నిర్మించి.. వాటిలో ఈ పాటను చిత్రీకరించబోతున్నారట. చైతుతో లగ్గాయిత్తు అనేందుకు తమ్ము కూడా ప్రిపేర్ అయిపోతోంది.