మిల్కీ బీచ్ వ్యూ అపార్ట్ మెంట్ ఖరీదెంత?

0

ముంబైలో ఖరీదైన సెలబ్రిటీలు నివాసం ఉండే రేర్ ప్లేస్ వెర్సోవా. ఆల్మోస్ట్ బాలీవుడ్ టాప్ సెలబ్రిటీలందరికీ ఇక్కడ సొంతంగా అపార్ట్ మెంట్లు ఉన్నాయి. 15 కోట్ల రేంజు నుంచి 100 కోట్లు పైగా ధర పలికే అపార్ట్ మెంట్లు .. విల్లాలు ఈ ఏరియాలో దర్శనమిస్తుంటాయి. వెర్సోవాలో అసలే ఓవైపు సముద్రం వ్యూ అదిరిపోతుంది. అలాంటి చోట అపార్ట్ మెంట్ దక్కించుకోవాలన్న కుతూహాలం స్టార్లకు ఉంటుంది. బాలీవుడ్ అందగత్తెలు సోనమ్.. సోనాక్షి.. సైతం ఇదివరకూ ఇక్కడ సొంతంగా అపార్ట్ మెంట్లు కొనుక్కున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు అదే చోట సౌత్ స్టార్ హీరోయిన్.. మిల్కీ బ్యూటీ తమన్నా వెర్సోవా- జుహూ లింక్ రోడ్ ఏరియాలో అదిరిపోయే అపార్ట్ మెంట్ ని సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఆకాశ హార్మ్యాన్ని తలపించే ఆ భవంతిలో మిల్కీ అపార్ట్ మెంట్ 14వ అంతస్తులో ఉందట. ఈ అపార్ట్ మెంట్ ఖరీదు 16.60 కోట్లు. ఇందులో ఇంటీరియర్ కోసమే మరో 2 కోట్లు ఖర్చు చేయనుందట. ఇక నాలుగు వైపులా ఎటు వెళ్లినా ఇందులోంచి అదిరిపోయే బీచ్ వ్యూ కనిపిస్తుందట. ప్రస్తుతం తమన్నా తన కుటుంబ సభ్యులతో కలిసి ముంబై లోఖండ్ వాలా ఏరియాలో నివశిస్తోంది. అక్కడి నుంచి సొంత అపార్ట్ మెంట్ లోకి తమన్నా ఫ్యామిలీ షిఫ్ట్ అవుతుందట.

తమన్నా ఇటీవలే ఎఫ్ 2 తో హిట్ కొట్టింది. బాలీవుడ్ లో నటించిన కామోషీ ఇటీవలే రిలీజైనా ఆశించిన స్థాయిలో విజయం దక్కించుకోలేదు. ప్రభుదేవా ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించారు. చక్రి తోలేటి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. తదుపరి `దటీజ్ మహాలక్ష్మి` రిలీజ్ కి రావాల్సి ఉంది.