నీ కోరిక తీర్చాలని ఉంది తర్వలో చేద్దాం

0

హీరోయిన్స్ మద్య పోటీ వాతావరణం ఉంటుంది ఒకరంటే ఒకరు పోటీ తత్వం ఉండటం వల్ల శత్రువులగా చూస్తారనే టాక్ ఉంది. అయితే కొందరు హీరోయిన్స్ మాత్రం చాలా స్నేహంగా ఉంటారు. వృత్తి పరంగా పోటీ ఉన్నా కూడా వ్యక్తిగతంగా మాత్రం మంచి స్నేహితులు చాలా మందే ఉన్నారు. తమన్నా కాజల్ చాలా మంచి స్నేహితులు. వీరిద్దరు కలిసి త్వరలోనే జాయింట్ గా ఒక సినిమాను నిర్మించబోతున్నారు. ఇక కాజల్ కంటే తమన్నాకు శృతి హాసన్ అంటే మరింత ఇష్టమట. ముఖ్యంగా ఏదైనా చిలిపి పని చేయాలంటే శృతి హాసన్ తో చేయాలనుకుంటాను అంటూ తాజాగా ఒక తమిళ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా చెప్పుకొచ్చింది.

శృతి హాసన్ తో ఎక్కువ టైం స్పెండ్ చేసేందుకు నేను ఇష్ట పడతాను. ఏ పని చేసినా ఎలాంటి సందర్బంలో అయినా కూడా శృతి హాసన్ తో ఉంటే అది మరింత సరదా సందర్బం అవుతుందని తమన్నా చెప్పుకొచ్చింది. ముఖ్యంగా చిలిపి పనులు అల్లరి పనులు చేయాలి అంటే అది కేవలం శృతి హాసన్ తోనే అంది. ఇక నేను మరో హీరోయిన్ తో కలిసి నటించాల్సిన సందర్బం వస్తే అది శృతిహాసన్ తో చేయాలని కోరుకుంటున్నట్లుగా ఇంటర్వ్యూలో పేర్కొంది.

తమన్నా కోరికపై తాజాగా శృతిహాసన్ స్పందిస్తూ నా కోరిక కూడా అదే నీతో నటించేందుకు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. తప్పకుండా నీ కోరిక తీర్చాలని ఉంది. మంచి కథతో కలిసి నటిద్దాం అంటూ శృతి హాసన్ చెప్పుకొచ్చింది. మొత్తానికి వీరిద్దరి మద్య చాలా అన్యోన్యత కనిపిస్తుంది. మరి వీరిద్దరు కలిసి ఎప్పుడు నటిస్తారో చూడాలి.
Please Read Disclaimer