డేటింగ్ చేస్తే గీస్తే ఆ హీరోతోనే చేస్తుందట!

0

ఒక్కొకరికి ఒక్కోరు నచ్చుతారు. కొందరికి మెగాస్టార్ ఇష్టం.. మరికొందరికి సూపర్ స్టార్ ఇష్టం.. ఇంకొందరికి బర్నింగ్ స్టార్ అంటేనే ప్రేమ. ప్రేక్షకుల్లో ఇన్నిరకాల అభిరుచులు ఉన్నట్టే సెలబ్రిటీలకు కూడా విభిన్న అభిరుచులు ఉంటాయి. మనం మిల్కీ బ్యూటీగా పిలుచుకునే పాలరాతి శిల్పం లాంటి తమన్నాకు కూడా కొన్ని ఇష్టాలు ఉన్నాయి.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మిల్కీని “మీరు కనుక డేట్ కు వెళ్ళాలనుకుంటే ఏ హీరోతో వెళ్తారు?” అని ప్రశ్న అడిగారు. ఎక్కువసేపు ఆలోచించకుండా తమన్నా బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ పేరు చెప్పింది. ‘సంజు’ సినిమాలో రణబీర్ ఫ్రెండ్ పాత్రలో నటించి అందరినీ మెప్పించిన విక్కీ ఆ సినిమా తర్వాత ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ సినిమాలో హీరోగా నటించి అందరినీ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇప్పుడు మన మిల్కీ ఆ ఉరి హీరోపై మనసు పారేసుకుంది.

కొద్ది రోజుల క్రితం తమన్నాను లిప్ లాకుల గురించి ఒక ప్రశ్న అడిగితే తాను వ్యక్తిగతంగా వాటికి వ్యతిరేకమని.. కానీ హృతిక్ రోషన్ తో మాత్రం రీల్ లిప్పులాకులకు రెడీ అని వెల్లడించింది. ఎందుకని కారణం అడిగితే గ్రీకు గాడ్ ను ఆరాధించే అభిమానినని శెలవిచ్చింది. అర్థం అయిందిగా.. హృతిక్ రోషన్ సినిమాలో ఛాన్స్.. విక్కీ కౌశల్ సినిమాలో ఆఫర్లు వస్తే బాగుటుందని మిల్కీ మనసులో ఉంది. తత్వాన్ని అర్థం చేసుకోరూ..!
Please Read Disclaimer