మిల్కీ మరీ ఇంత రెబల్ గానా!

0

మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా కంబ్యాక్ గురించి తెలిసిందే. బాహుబలి తర్వాత ఈ అమ్మడు సరైన ఆఫర్లు లేక గ్యాప్ మెయింటెయిన్ చేయడంతో ఇక మిల్కీ పని అయిపోయింది అంటూ ప్రచారమైంది. అయితే ఆ తర్వాతా తమన్నా ఆ ఫేజ్ ని తెలివిగా మ్యానేజ్ చేసి వరుసగా భారీ క్రేజీ చిత్రాలకు కమిటైంది. చిరంజీవి- నాగార్జున- వెంకటేష్ వంటి అగ్ర కథానాయకుల సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ఊపిరి-ఎఫ్2-సైరా చిత్రాల్లో తమన్నా నటించిన సంగతి తెలిసిందే. ఎఫ్ 2 చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయం అందుకుని అటుపై వెంటనే సైరా లాంటి పాన్ ఇండియా సినిమాలోనూ ఇంపార్టెంట్ పాత్రలో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది.

వరుసగా పాన్ ఇండియా ఆఫర్లతో మిల్కీ దశ తిరిగిపోయింది అంటూ అభిమానుల్లో ముచ్చటా సాగింది. ఇక ఇదే ఉత్సాహంలో వరుసగా సినిమాలకు కమిటవుతోంది ఈ భామ. ఓవైపు బాలీవుడ్ ని టచ్ లో పెడుతూనే మరోవైపు తెలుగు-తమిళంలోనూ అవకాశాల్ని అందిపుచ్చుకుంటోంది. ప్రస్తుతం విశాల్ సరసన యాక్షన్ అనే చిత్రంలో నటించింది. ఈ నెల 15న ఈ చిత్రం అత్యంత భారీగా రిలీజవుతోంది. ఆ క్రమంలోనే మిల్కీ ప్రచారకార్యక్రమాలతో బిజీబిజీగా ఉంది. ఇక ఈ చిత్రంలో అమ్మడు పూర్తిగా యాక్షన్ క్వీన్ అవతారంలో అదరగొట్టేయబోతోందని ఇటీవల రిలీజైన ట్రైలర్ చెబుతోంది. నేటి సాయంత్రం మౌల మౌల అంటూ సాగే సింగిల్ ని రిలీజ్ చేస్తున్నారు.

మరోవైపు మిల్కీ బ్యూటీ సామాజిక మాధ్యమాల్లో ఫోటోషూట్లను షేర్ చేస్తోంది. తన ఇన్ స్టాలో ఓ హాట్ ఫోటోని అభిమానుల కోసం షేర్ చేసింది. ఈ ఫోటో తమన్నా రెబలియన్ యాటిట్యూడ్ ని ఎలివేట్ చేస్తోంది. బ్లాక్ ఇన్ వోర్.. దానిపై ఫ్లోరల్ డిజైన్ టాప్ .. కాంబినేషన్ బాటమ్ లైనప్ తో కనిపించింది. చెవులకు భారీ సైజ్ టైర్ రింగ్స్ ని ధరించి రెబల్ యాటిట్యూడ్ ని ఎలివేట్ చేసింది. మిల్కీ నెవ్వర్ బిఫోర్ రెబల్ లుక్ ఇదని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ ఫోటో ఫ్యాన్స్ సోషల్ మీడియాల్లో వైరల్ గా మారింది.
Please Read Disclaimer