క్వారంటైన్ లో మామ్ డాడ్.. మిల్కీలో టెన్షన్ ఇలా!

0

కరోనా వైరస్ కారణంగా ఇంటికే పరిమితమైన స్టార్స్ నెమ్మదిగా భయాన్ని వీడి బయటికొస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా తాజాగా ముంబై వీధుల్లో సందడి చేసింది. గత కొన్ని నెలలుగా గ్లామర్ తళుకులకు మెరుగులద్దుకోవడానికి స్పాలకు.. బ్యూటీ పార్లర్.. హెయిర్ స్టైలిస్ట్ సెలూన్ లకు దూరంగా వున్న తమన్నా తాజాగా ఇందు కోసం ఇంటి నుంచి ఇదిగో ఇలా బయట అడుగు పెట్టింది. ముంబై వీధుల్లో చిట్టి పొట్టి షార్ట్ తో సందడి చేసింది.

బ్లాక్ షార్ట్… లైట్ యాష్ కలర్ టీషర్ట్ ముఖానికి మాస్క్ ధరించి ముంబై వీధుల్లో దర్శనమిచ్చింది. ముంబైలోని షట్టర్ బగ్స్ సెలూన్ ముందు ఎంతో ఇదిగా హొయలు పోయింది. తమన్నా పేరేంట్స్ కి ఇటీవల కరోనా సోకిన విషయం తెలిసిందే. వారు ప్రస్తుతం హోమ్ క్వారెంటైన్ లో వుంటున్నారు. ఈ వార్త తెలిసిన చాలా రోజుల తరువాత తమన్నా ఇలా బయటికి రావడం ఇదే ఫస్ట్ టైమ్. పైగా ఎలాంటి మేకప్ లేకుండా తమన్నా క్యాజువల్ లుక్ లో ఓ సాధారణ యువతిగా ముంబై వీధుల్లోకి రావడం ఇదే తొలి సారి.

తమన్నాకు సంబంధించిన ఈ పొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం తమన్నా `సీటీమార్` చిత్రంలో నటిస్తోంది. సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటిస్తున్నారు. కబడ్డీ కోచ్ జ్వాలారెడ్డిగా తమన్నా ఇందులో పవర్ఫుల్ పాత్రలో కనిపించనుంది.