పార్టీలో మిల్కీతో చిలౌట్ చేసిందెవరు?

0

సంక్రాంతి హోరా హోరీ నువ్వా నేనా? అన్నట్టుగా వేడెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వరుస ఈవెంట్లతో సరిలేరు టీమ్.. అల వైకుంఠపురములో టీమ్ సెలబ్రేషన్స్ వేడెక్కిస్తున్నాయ్. ఇక సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్ వేడుక అనంతరం పార్టీ గురించి సర్వత్రా అభిమానుల్లో ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే.

ఈ పార్టీలో మహేష్- నమ్రత దంపతులు సహా చిత్రబృందం పాల్గొంది. వీళ్లతో పాటే మరో ముగ్గురు స్పెషల్ గెస్టులు పార్టీలో కనిపించారు. ఈ చిత్రంలో ఓ స్పెషల్ పార్టీ సాంగ్ లో నర్తించిన తమన్నా సరిలేరు ప్రీరిలీజ్ పార్టీలోనూ పాల్గొంది. ఆ రోజు మహేష్ వారసురాలు సితార చేసిన సందడి అంతా ఇంతా కాదని తాజాగా రివీలైన ఫోటో చెబుతోంది.

ఈ సందర్భంగా నమ్రత ఇన్ స్టాలో ఫోటోల్ని రివీల్ చేయడంతో పాటు ఆసక్తికర వ్యాఖ్యను జోడించారు. “బ్లాక్ బస్టర్ దిశగా అడుగులు వేస్తూ.. చరిత్ర సృష్టించబోతున్న సరిలేరు నీకెవ్వరు టీం సందడి ఇది. పార్టీలో ఛాయాగ్రాహకుడు రత్నవేలును మిస్సవుతున్నాం. అయినా ఫర్వాలేదు సర్.. 11న ఇంతకంటే పెద్ద పార్టీ చేసుకుందాం“ అంటూ నమ్రత వ్యాఖ్యను జోడించారు. ఈ పార్టీలో దర్శకుడు అనిల్ రావిపూడి- రామజోగయ్య శాస్త్రి- దేవీశ్రీ ప్రసాద్- విజయశాంతి- తమన్నా- రష్మిక మందన్న తదితరులు పాల్గొన్నారు. మహర్షి డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ సెలబ్రేషన్స్ కి ఎటెండయ్యారు. జనవరి 11న విడుదలవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-