బాలయ్య కు నో చెప్పిందట

0

మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా కెరీర్ జర్నీ గురించి తెలిసిందే. బాహుబలి అవంతికగా గుర్తింపు వచ్చినా అటుపై అవకాశాలైతే రాలేదు. కొన్నాళ్ల పాటు అటు తమిళ పరిశ్రమలోనే పబ్బం గడపాల్సిన పరిస్థితి తలెత్తింది. అటుపై తెలుగు లో అందివచ్చిన కొన్ని అవకాశాలు తనకు కలిసొచ్చాయి. ఇటీవలే సైరా నరసింహా రెడ్డి లాంటి పాన్ ఇండియా చిత్రంలో అద్భుతమైన అవకాశం అందుకుంది. యాక్షన్ చిత్రంలోనూ అదరగొట్టింది.

ఇండస్ట్రీ స్టార్ హీరోలందరి సరసన అవకాశాలు అందుకున్న మిల్కీకి నటసింహా నందమూరి బాలకృష్ణ సరసన బోయపాటి సినిమాలో నటించే అవకాశం దక్కిందట. అయితే ఈ ఆఫర్ ని మిల్కీ సున్నితంగా తిరస్కరించిందని తెలుస్తోంది. అయితే బాలయ్యను కాదనుకునేంత బిజీగా ఉందా? అంటే.. మిల్కీకి ఇప్పటికిప్పుడు చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేనేలేవు.

ప్రస్తుతం గోపిచంద్ సరసన `సీటీ మార్` అనే మాస్ చిత్రం లో అవకాశం అందుకుంది. ఇదొక్కటే టాలీవుడ్ ప్రాజెక్ట్. అటు హిందీలో బోలే చుడియాన్ అనే చిత్రంలో నటిస్తోంది. దటీజ్ మహాలక్ష్మి రిలీజ్ కి రావాల్సి ఉంది. అయితే తమన్నా అంత పెద్ద ఆఫర్ వస్తే తిరస్కరించేంత బిజీగా అయితే లేదు. ఇక బాలయ్య- బోయపాటి లాంటి క్రేజీ కాంబోనే కాదని అనుకుంది అంటే ఇంకేదైనా బలమైన రీజన్ ఉందేమో తనే చెప్పాలి.
Please Read Disclaimer