చనిపోతాననే భయం వెంటాడింది!-తమన్నా

0

మిల్కీవైట్ బ్యూటీకి కోవిడ్ 19 పాజిటివ్ అని నిర్థారణ అయిన సంగతి తెలిసిందే. అనంతరం ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్సతో వేగంగానే కోలుకోగలిగింది. అయితే కోవిడ్ సోకాక తాను చనిపోతానని ఎంతో భయపడ్డానని తెలిపింది తమన్నా. ఆ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది.

కోవిడ్ లక్షణాలు తీవ్రతరం అవ్వడంతో చాలా ఇబ్బంది పడ్డానని ఆ సమయంలో తనకు చనిపోతాననే ఆలోచనలు వెంటాడాయని కూడా తెలిపింది. ఒక రకంగా తమన్నా ప్యానిక్ అయ్యారట. వైద్యులు సరైన చికిత్సతో తనని బతికించారని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపింది.

కరోనా చికిత్స పొంది తిరిగి వచ్చాక ఫోటో షేర్ చేస్తే లావుగా కనిపించానని .. అలా ఎందుకు మారావ్? అంటూ నెటిజన్ ప్రశ్నించాడని ఆవేదన చెందింది. తాను ఉన్న పరిస్థితి ఎలాంటిది? అన్నది తెలుసుకోకుండా ఇలా మాట్లాడుతారని అర్థమైంది అంటూ ఆవేదనను చెందారు తమన్నా.

ప్రస్తుతం ఈ భామ గోపీచంద్ సరసన సీటీమార్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నితిన్ సరసన అంధాధున్ లో నటించనుంది. అలాగే గుర్తుందా సీతాకాలం లోనూ నటిస్తోంది. కరోనా నుంచి కోలుకున్న అనంతరం షూటింగుల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ కి వచ్చిన సంగతి తెలిసిందే.