బిగిల్ బ్యూటీ గుంటూరు మిర్చి చందం

0

కూర్గ్ బ్యూటీ వర్ష బొల్లమ్మ బిగిల్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన సంగతి తెలిసిందే. తొలి సినిమాలో ఫుట్ బాల్ ప్లేయర్ గా ఛాలెంజింగ్ రోల్ లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కూర్గ్ ఎంత ఆహ్లాద కరమైన అందమైన ప్రదేశం కాబట్టి… ఈ అమ్మడి అందచందాల గురించి వర్ణించాల్సిన పనే లేదు. టాలీవుడ్ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ హీరోగా నటించిన చూసి చూడగానే సినిమా తో స్ట్రెయిట్ నాయిక గా పరిచమవుతుంది. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే శర్వానంద్-సమంత జంటగా నటిస్తోన్న జాను సినిమా లోనూ వర్ష బొల్లమ్మ ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది.

అయితే ఈ రెండు సినిమాల ఫలితాలు ఇంకా తేలకముందే అమ్మడు మరో ఛాన్స్ అందుకుందిట. దొరసాని ఫేం ఆనంద్ దేవరకొండ సరసన ఈ బ్యూటీ ఛాన్స్ అందుకున్న విషయం ఆలస్యంగా రివీలైంది. వర్ష తన మూడవ సినిమాలో ఆనంద్ సరసన నటిస్తున్నట్లు తెలిపింది. ఇందులో అమ్మడు గుంటూరు గాళ్ గా కనిపించనుందిట. మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువతి గా తెలుగు ప్రేక్షకులను ఆ పాత్ర ఆకట్టుకుంటుందని ధీమాను వ్యక్తం చేసింది. కాస్త గుంటూరు మిర్చి తరహా లో మాసీ స్టైల్లో ఉంటుందని వెల్లడించింది.
Please Read Disclaimer