రవితేజ.. అనుష్కల తో అరవ హీరో ఢీ

0

రవితేజ నటించిన ‘డిస్కోరాజా’ మరియు అనుష్క నటించిన ‘నిశబ్దం’ చిత్రాలు సంక్రాంతి సీజన్ తర్వాత అంటే జనవరి చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్న విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాలు కూడా భారీ అంచనాల ను కలిగి ఉన్నాయి. రెండు సినిమాలు ఒకే సారి రావడం వల్ల రెండింటికి కూడా నష్టం జరుగుతుందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ రెండు సినిమాల మద్య కనీసం రెండు మూడు రోజుల గ్యాప్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.

జనవరి చివరి వారం కోసం ఈ రెండు సినిమాలు కొట్టుకుంటున్న సమయం లో అనూహ్యం గా తమిళ స్టార్ హీరో సూర్య కూడా తన తాజా చిత్రం తో అదే సమయం లో రాబోతున్నట్లు గా ప్రచారం జరుగుతోంది. సుధ కొంగర దర్శకత్వం లో తెరకెక్కిన ‘సూరరై పొత్రు’ను జనవరి చివరి వారంలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. తెలుగు లో కూడా ఈ సినిమా ను భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవలే ఫస్ట్ లుక్ విడుదల చేయగా సూర్య అభిమానులు సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఎయిర్ డెక్కన్ ఫౌండర్.. కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారం గా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఆసక్తి కర అంశాల తో పాటు ఎంటర్ టైన్ మెంట్ కూడా ఈ చిత్రంలో కావాల్సినంత ఉంటుందంటూ యూనిట్ సభ్యులు ప్రచారం చేస్తున్నారు. కనుక సినిమా ఖచ్చితం గా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం తో ఉన్నారు. సూర్య కు తెలుగు లో మంచి మార్కెట్ ఉంది. కనుక రవితేజ మరియు అనుష్కల తో పోటీ పడటం వల్ల అందరు నష్ట పోయే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.
Please Read Disclaimer