యువ సంగీత దర్శకుడు మృతి

0

తమిళంలో పలు సినిమాలకు సంగీతాన్ని అందించిన యువ సంగీత దర్శకుడు నవీన్ శంకర్ హఠాత్మరణం సినీ వర్గాల వారిని మరియు కుటుంబ సభ్యులను శోకంలో ముంచింది. శనివారం రాత్రి సమయంలో హఠాత్తుగా నవీన్ తీవ్ర అనారోగ్యంకు గురి అయ్యాడు. అప్పటి వరకు బాగానే ఉన్న నవీన్ లేవలేని స్థితికి చేరడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. వెంటనే నవీన్ ను పరీక్షించిన వైధ్యులు బ్రెయిన్ లో రక్తం గడ్డ కట్టినట్లుగా గుర్తించారు. అందుకు సంబంధించిన చికిత్స అందిస్తుండగా నవీన్ మృతి చెందినట్లుగా వైధ్యులు పేర్కొన్నారు.

నవీన్ కరోనా అంటూ నిన్న ఉదయం ప్రచారం జరిగింది. అయితే కరోనా పరీక్షల్లో నవీన్ కు నెగటివ్ వచ్చిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఇతర అనారోగ్య సమస్యలు లేకుండా ఉన్నట్లుండి నవీన్ మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు సినిమాలకు పాటలను ఎన్నో సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను అందించిన నవీన్ మృతి పట్ల తమిళ సినీ ప్రముఖులు దిగ్ర్బాంతిని వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.