కాసుకోండి..సర్కార్ HD ప్రింట్ ఆన్ లైన్ లో!

0

పైరసీ అనేది ఇప్పుడు అన్నీ ఫిలిం ఇండస్ట్రీలు కామన్ గా ఎదుర్కొంటున్న సమస్య. అక్కడ హాలీవుడ్ నుండి ఇక్కడ టాలీవుడ్ వరకూ అందరి సినిమాలు పైరసీ బారిన పడుతున్నాయి. ఇక తమిళ సినిమాలకు ఈ బెడద మరింత ఎక్కువ. పైరసీ వెబ్ సైట్లు కోకొల్లలుగా ఉన్నాయి. తమిళ ఫిలిం ఇండస్ట్రీ కి సంబంధించిన అసోసియేషన్స్ చొరవ చూపి చాలా పైరసీ వెబ్ సైట్స్ ను ఆపగలిగారు కానీ తమిళ్ రాకర్స్ ను అడ్డుకోవడం మాత్రం వారివల్ల కావడం లేదు.

తమిళ్ రాకర్స్ వెబ్సైట్ కొత్త కొత్త సినిమాలను రిలీజ్ కాగానే తమ సైట్ లో పెడుతూ ఎప్పటికప్పుడు ఫిలింమేకర్స్ కు సవాలు విసురుతూనే ఉంది. తాజాగా తమిళ చిత్రం ‘సర్కార్’ HD ప్రింటును ధియేటర్లలో రిలీజ్ అయ్యే కొన్ని గంటల ముందే మా సైట్ లో పెడతామని ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది. తమిళ్ రాకర్స్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వారు ఈ విషయం ప్రకటించారు. విజయ్ – మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ హ్యాట్రిక్ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తెలుగులో పెద్దగా హంగామా లేదు గానీ తమిళ వెర్షన్ కోసం కళ్ళు కాయలు కాచేలా విజయ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో తమిళ్ రాకర్స్ ప్రకటన అందరికీ షాక్ ఇచ్చింది.

ఈ ప్రకటన వచ్చిన తర్వాత తమిళ్ రాకర్స్ వెబ్ సైట్ ను డౌన్ చేసి వాళ్ళను ఆపాలని ప్రయత్నం జరిగినా అది కుదరలేదట. ఇదిలా ఉంటే తమిళ నిర్మాతల సంఘం థియేటర్ ఓనర్లను థియేటర్ల వద్ద సినిమా పైరసి కానివ్వకుండా చూడాలని ఉండాలని.. మొబైల్ ఫోన్స్ తోనూ ఇతర కెమెరాలతోనూ రికార్డింగ్ చేయనివ్వకుండా ఆపాలని కోరుతూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలు సరేగానీ తమిళ రాకర్స్ అరాచకాన్ని ఆపెదేవరో?
Please Read Disclaimer