100 కోట్ల దర్శకుడు షాకింగ్ నిర్ణయం

0

స్టార్ హీరోల నుండి చిన్న హీరోల వరకు అంతా కూడా హిట్ దర్శకుల వెంట పడుతూ ఉంటారు. ఒక దర్శకుడికి హిట్ పడితే వెంటనే ఆ దర్శకుడితో చేయాలనుకుంటారు. దర్శకులు ఒక్కసారి నిరూపించుకుంటే స్టార్ హీరోలు సైతం వారి ముందు క్యూ కట్టాల్సిందే. తమిళ దర్శకుడు వెట్రిమారన్ కు మంచి క్రేజ్ ఉంది. ఈయన చేసిన సినిమాలన్నీ కూడా మంచి సక్సెస్ అయ్యాయి. ఇటీవల వచ్చిన అసురన్ చిత్రం ఏకంగా వంద కోట్ల వసూళ్లను దక్కించుకుంది.

అసురన్ చిత్రం తర్వాత వెట్రిమాన్ పేరు ఇండియా మొత్తం మారుమ్రోగిపోతుంది. ఇలాంటి సమయంలో సౌత్ స్టార్ హీరోలు మాత్రమే కాకుండా బాలీవుడ్ హీరోలు కూడా ఈయన దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తిగా ఉంటారు. కాని ఈయన మాత్రం సినిమాను కాకుండా ఒక వెబ్ సిరీస్ ను చేసేందుకు సిద్దం అయ్యాడు. నెట్ ప్లిక్స్ నిర్మాణంలో ఒక విభిన్నమైన వెబ్ సిరీస్ ను తెరకెక్కించే పనిలో దర్శకుడు వెట్రి మారన్ ఉన్నట్లుగా తమిళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఈ వెబ్ సిరీస్ లో సౌత్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ప్రధాన పాత్రలో కనిపించబోతుంది. ప్రకాష్ రాజ్ కూడా ఈ వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. వెబ్ సిరీస్ లకు ఈమద్య కాలంలో భారీ డిమాండ్ ఉంది. అందుకే సినిమాల స్థాయిలో నిర్మిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్.. నెట్ ఫ్లిక్స్ సంస్థలు పోటీ పడి మరీ భారీ వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్నాయి. అందులో భాగంగానే నెట్ ఫ్లిక్స్ ఈ భారీ వెబ్ సిరీస్ ను నిర్మించేందుకు సిద్దం అయ్యింది.

ఈ వెబ్ సిరీస్ తర్వాత వెట్రిమారన్ సినిమా చేస్తాడేమో చూడాలి. ఈ వెబ్ సిరీస్ కు కూడా వెట్రీ మారన్ భారీ పారితోషికం తీసుకుంటున్నాడని.. అందుకే సినిమాల ఆఫర్లు వచ్చినా దీనికి ఓకే చెప్పాడంటూ తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
Please Read Disclaimer