మళ్లీ షూటింగ్స్ కు బ్రేక్

0

మహమ్మారి వైరస్ కారణంగా దాదాపు మూడు నెలల పాటు షూటింగ్స్ అన్ని ఎక్కడికి అక్కడ నిలిచి పోయాయి. ఇటీవలే ప్రభుత్వాలు కాస్త ఉపశమనం కలిగించేలా షూటింగ్స్ కు కొన్ని కండీషన్స్ తో అనుమతులు ఇచ్చారు. సినీ కార్మికులకు ఎట్టకేలకు పని లభించడంతో అంతా బిజీ బిజీ అయ్యారు. తెలుగుతో పాటు పలు భాషల్లో షూటింగ్స్ జరుగుతున్నాయి. తెలుగులో స్టార్ హీరోల సినిమాలు షూటింగ్ ప్రారంభం కాలేదు. కాని చిన్న హీరోల సినిమాలు మరియు సీరియల్స్ షో లు మాత్రం ప్రారంభం అయ్యాయి.

తమిళ సినిమా పరిశ్రమలో కూడా ప్రస్తుతానికి షూటింగ్స్ లేవు. కాని తమిళ సీరియల్స్ షూటింగ్స్ కు అనుమతులు వచ్చాయి. గత వారం పది రోజులుగా షూటింగ్స్ జరుగుతున్నాయి. తమిళనాట వైరస్ కేసులు అమాంతం పెరిగిన నేపథ్యంలో మళ్లీ అక్కడ ప్రభుత్వం సీరియస్ గా చర్యలు తీసుకుంటుంది. ఈ సమయంలోనే చెన్నై సహా పలు ప్రాంతాల్లో షూటింగ్స్ కు అనుమతులు నిరాకరించింది.

కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈనెల 19వ తారీకు నుండి తమిళ నాడు ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. అందులో భాగంగానే తమిళ సీరియల్స్ షూటింగ్స్ కూడా ఆగిపోయాయి. దాంతో మళ్లీ తమిళ సినీ కార్మికులు మరియు బుల్లి తెర కార్మికులు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ ఎప్పటికి షూటింగ్స్ కు అనుమతులు వస్తాయి అనేది తెలియడం లేదు. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా మళ్లీ షూటింగ్స్ కు బ్రేక్ వేస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాని ప్రస్తుతానికి మాత్రం హైదరాబాద్ లో షూటింగ్స్ కు ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు.
Please Read Disclaimer