తమిళ నిర్మాత కారణంగా టాలీవుడ్ పెద్ద మనిషి నష్టపోయారట!

0

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం తమ్మారెడ్డి భరద్వాజ. ప్రయోగాత్మక చిత్రాల్ని నిర్మించే నిర్మాతగా ఆయనకున్న పేరు అంతా ఇంతా కాదు. ఇటీవల కాలంలో ఆయన సినిమాలు పెద్దగా చేయటం లేదు. విషయం ఏదైనా సరే.. ఓపెన్ గా మాట్లాడే ఆయన.. తాజాగా తాను నష్టపోయిన వైనాన్ని వెల్లడించారు.

ఇటీవల కాలంలో హాట్ టాపిక్ గా మారి.. మీడియా మొత్తం మాట్లాడుకున్న చిత్రం ఆమె. అమలాపాల్ ప్రధాన పాత్రధారిగా చేసిన ఈ సినిమాలో ఆమె నగ్నంగా నటించటం.. అదో సంచలనంగా మారటం తెలిసిందే. గ్లామరస్ నటిగా సుపరిచితురాలైన అమలాపాల్ తన ఇమేజ్ కు డ్యామేజ్ అవుతుందన్న విషయాన్ని పట్టించుకోకుండా చేసిన చిత్రం ఆమె.

అయితే.. ఈ చిత్రం రిలీజ్ ఒక రోజు ఆలస్యంగా జరిగింది. దీని కారణంగా తాను చాలా నష్టపోయానని చెబుతున్నారు ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ఆమెచిత్రానికి తెలుగు వెర్షన్ కు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి చెల్లించాల్సిన మొత్తాన్ని తాను నెల రోజుల క్రితమే ఇచ్చేశానని.. తమిళనాడులోని డిస్ట్రబ్యూటర్లు కూడా ఇచ్చేశారన్నారు.

అయితే.. అందరి దగ్గర డబ్బులు తీసుకున్ననిర్మాతలు ఫైనాన్షియర్లకు డబ్బులు చెల్లించకపోవటంతో ముందుగా ప్రకటించినట్లు సినిమా ఈ నెల 19న విడుదల కాలేదని.. ఒక రోజు ఆలస్యంగా రిలీజ్ అయ్యిందన్నారు. దీంతో.. సినిమా మీద క్రేజ్ తగ్గి.. చచ్చిపోయిందన్నారు. విడుదలైన అన్ని థియేటర్లలో సినిమా హౌస్ ఫుల్ ఆడుతున్నా.. సరైన రిలీజ్ డేట్.. థియేటర్లు దొరక్క చాలామంది నష్టపోతున్నట్లు చెప్పారు.

తనకు జరిగిన నష్టం గురించి తాను ఇప్పటికే కంప్లైంట్ చేశానన్నారు. ఒక మంచి సినిమా తీయటం ఎంత ముఖ్యమో.. దాన్ని పద్దతిగా విడుదల చేయటం అంతే ముఖ్యమన్న పాఠాన్ని తాను ఆమె చిత్రంతో నేర్చుకున్నట్లు చెప్పారు. తమ్మారెడ్డి లాంటి ప్రముఖులు సైతం.. చిత్ర నిర్మాణానికి సంబంధించి.. విడుదలకు సంబంధించి పాఠాలు నేర్చుకోవటం అంటే.. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి వస్తున్న వారి సంగతేంటి?Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home