విసిగించిన ఆకతాయికి కౌంటర్ ఇచ్చిన తాప్సి

0

కొందరు జనాలు సెలబ్రెటీలను టార్గెట్ చేసి వారి దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో చాలా మంది స్టార్స్ పై బ్యాడ్ కామెంట్స్ చేయడం లేదంటే అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేయడం చేస్తూ ఉంటారు. అలా అడ్డ దిడ్డంగా ప్రశ్నలు వేయడం వల్ల సెలబ్రెటీలు కొన్ని సార్లు సహనం కోల్పోయి వాటికి సమాధానం చెప్పకుండా చిరాకు పడుతూ ఉంటారు. అప్పుడు వారికి పబ్లిసిటీ దక్కుతుంది. అందుకే సెలబ్రెటీల దృష్టిని ఆకర్షించేందుకు చాలా మంది ఈ ఇన్ డైరెక్ట్ వ్యూహం అమలు చేస్తూ ఉంటారు.

ఇటీవల ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో తాప్సి పాల్గొంది. ఈ సందర్బంగా తాప్సి మీడియా మరియు ప్రేక్షకుల ముందు మాట్లాడటం జరిగింది. కార్యక్రమం మొత్తం తాప్సి ఇంగ్లీష్ లో మాట్లాడటంపై ఒక వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేస్తూ మీరు హిందీ నటి కదా మీరు హిందీలో మాట్లాడవచ్చు కదా అంటూ సూచించింది. అప్పుడు తాప్సి ఇక్కడ చాలా మందికి హిందీ భాష తెలియదు అని అందుకే తాను హిందీలో మాట్లాడుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది.

ఆ వ్యక్తి తాప్సి సమాధానంకు సంతృప్తి పడకుండా మీరు హిందీ హీరోయిన్ అయినందున హిందీలో మాట్లాడటం భావ్యం అన్నట్లుగా వ్యాఖ్యలు చేయడంతో తాప్సి కాస్త ఘాటుగా ఆ వ్యక్తితో నేను హిందీ నటిని మాత్రమే కాదు. సౌత్ లోను సినిమాలు చేశాను. మరి తెలుగు మరియు తమిళంలో మాట్లాడితే ఓకేనా అంటూ ప్రశ్నించింది. తాప్సి కౌంటర్ కు అతడి నోరు మూసుకు పోయింది.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home