ఆకతాయి వేళ్లు విరిచేసిన తాప్సీ

0

2018-19 సీజన్ ని #మీటూ ఉద్యమం ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. హాలీవుడ్ సహా బాలీవుడ్ లో మొదలైన #మీటూ ఉద్యమం ఎందరో బాధితుల్ని వెలుగులోకి తెచ్చింది. ఈ ఉద్యమం నటీమణుల్లో ఎంతటి ధైర్యాన్ని నింపిందో చెప్పాల్సిన పనేలేదు. లైంగిక ఇబ్బదులకు గురైన బాధితులందా ధైర్యంగా ముందుకొచ్చి తమ గోడును ఒక్కసారిగా వెల్లబోసుకున్నారు. తనుశ్రీ దత్తా నింపిన స్ఫూర్తి తో ఎంతో మంది నటీమణులు తమపై జరిగిన దాడులను బహిర్గతం చేసి సంచలనం సృష్టించారు. బాలీవుడ్ సహా కోలీవుడ్ టాలీవుడ్ ఒక్క సారిగా లైంగిక ఆరోపణలతో అట్టుడికిపోయాయి. కన్నడ ఇండస్ట్రీలోనూ ఓ అగ్ర కథానాయిక వ్యవహారం సంచలనమైంది. సినీరంగంతో పాటు ఇతర రంగాలను మీటూ ఉద్యమం ఓ కుదుపు కుదిపేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ తరహా దాడులు ఏ పరిశ్రమలో జరిగినా వెంటనే వెలుగులోకి వస్తున్నాయి.

తాజాగా `వాట్ ఉమెన్ వాంట్` అనే టాక్ షో (కరీనా హోస్ట్ )లో తాప్సీ తన టీనేజ్ లో ఎదురైన ఓ భయానక అనుభవాన్ని వెల్లడించింది. గురుపూజ కోసం ఢిల్లీలోని గురుద్వారకు కుటుంబసమేతంగా వెళ్లినప్పుడు అక్కడ ఒక ఆకతాయి తనని అసభ్యంగా తాకాడని తెలిపింది. ఆ దేవాలయం బయట నిత్యం రద్దీగా ఉంటుందిట. ఫుడ్ స్టాల్స్…బొమ్మల అంగడుల వల్ల జనంతో రద్దీగా ఉంటుందిట. దేవాలయం లోపలికి వెళ్లాలంటే వాటన్నిటినీ దాటుకుని వెళ్లడం పెద్ద సవాల్. అలాంటప్పుడు ఒకరిపై ఒకరు మీద పడటం..తోపులాట… కొట్టుకోవడం వంటి ఘటనలు సర్వసాధరణం. అలాంటి సమయంలో ఓ ఆకతాయి అదును చూసి నన్ను తాకుతూ నాపై చేతులు వేసి అసభ్యంగా తాకాడు అని తాప్సీ ఎమోషన్ అయ్యింది.

జనాల మధ్యలో ఇలాంటివి సహజమేనని ముందు భావించినా.. ఆ ఆకతాయి అదే పనిగా వేళ్లతో తాకుతూ సంస్కారం అన్నదే లేకుండా హద్దు మీరడంతో ఆకతాయి రెండు వెళ్లు పట్టుకుని మెలితిప్పి విరిచేశానని తాప్సీ తెలిపింది. ఆ ఘటన ఎప్పటికీ మర్చిపోలేనిదని…సమాజంలో ఇలాంటి చీడపురుగులు ఉన్నంత కాలం స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది అంటూ తాప్సీ ఆవేదనను వ్యక్తం చేసింది. ప్రస్తుతం తాప్సీ మిథాలీ రాజ్ బయోపిక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer