ఆవిడకు బెటర్ డ్రెస్ లు తొడగండి!

0

బాలీవుడ్ రైజింగ్ బ్యూటీస్ లో హాటెస్ట్ యంగ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా. హేట్ స్టోరి మొదలు ఈ అమ్మడి కెరీర్ స్పీడందుకున్న సంగతి తెలిసింందే. అయితే ఈ భామ సినిమాల్లో అరకొర డ్రెస్సుల్లో తన అందాల్ని ఆరాంగా వడ్డించేస్తుంటుంది. అందుకే ఊర్వశి ఫొటో షూట్ రాక కోసం కుర్రకారు ఆత్రంగా వేచి చూస్తారు. అందుకు తగ్గట్టే ఊర్వశి అందాల ట్రీట్ ఇటీవల పీక్స్ కి చేరుకుంది. ఇక ఊర్వశి నటించే చిత్రాల్లోనూ ఎక్కడా అందాల విందుకు కొదవే ఉండదు. కాస్ట్యూమ్స్ ని వీలైనంత పొదుపుగా వాడేస్తూ తన అందాలతో ప్రేక్షకులకు కనువిందు చేయడంలో ఎలాంటి మొహమాటానికి వెళ్లదు.

అయితే ఊర్వశి వ్యవహారంపై తాజాగా తాప్సీ పన్ను విసిరిన పంచ్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ మధ్య ఎడా పెడా ఎవరిని పడితే వాళ్లను మీడియా ముఖంగా ఏకేస్తున్న తాప్సీ.. రంగోలి- కంగన తరహాలోనే చెలరేగుతోంది. నిన్ననే నటవారసుడు హర్షవర్ధన్ కపూర్ ని ఆడేసుకుంది. తాజాగా ఊర్వశిని టార్గెట్ చేసింది.

తాజాగా ఓ రియాలిటీ షోలో పాల్గొన్న తాప్సీ ఊర్వశికి సంబంధించిన అసలు నిజాల్ని బయటపెట్టి షాకిచ్చింది. నేహా దూపియా ‘నో ఫిల్టర్ నేహా’ టాక్ షోలో వేడెక్కించే కామెంట్లు చేసింది. ఈ షోలో పాల్గొన్న తాప్సీ హాటీ హీరోయిన్ ఊర్వశీ రౌతేలా బాడీపైనా.. డ్రెస్సింగ్ సెన్స్ పైనా తీవ్ర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఊర్వశీ రౌతేలాది గ్రేట్ బాడీనే .. కాదని అనను.. కానీ ఆమె డ్రెస్సింగ్ స్టైల్.. అందాల్ని ప్రదర్శించే తీరులో మార్పు వస్తే బాగుంటుందేమో అంటూ పంచ్ వేసింది.

ఓ హీరోయిన్ గురించి మరో హీరోయిన్ ఈ స్థాయిలో మాట్లాడటం బాలీవుడ్ లో కొత్త కాకపోయినా ఈ స్థాయిలో మాట్లాడటం మాత్రం తొలి సారి కావడంతో అంతా అవాక్కవుతున్నారు. ఓ హీరోయిన్ అంగాంగ ప్రదర్శన గురించి ఇండైరెక్ట్ గా మరో హీరోయిన్ పబ్లిక్ వేదికపై చురకలు అంటించడం చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపై ఊర్వశీ రౌతేలా ఏమని కౌంటరిస్తుందో చూడాలి.
Please Read Disclaimer