పా….ర్టీ అంటున్న తాప్సీ సిస్టర్స్

0

టాలీవుడ్ హీరోయిన్.. డింపుల్ బ్యూటీ తాప్సీ పన్ను ఈమధ్య ఎక్కువగా హిందీలో నటిస్తూ మంచి విజయాలు సాధిస్తోంది. తెలుగులో సినిమాలు తగ్గించేసింది. అయితే ఎంత బిజీగా ఉన్నప్పటికీ తాప్సీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. మన టాలీవుడ్ స్టార్ హీరోల తరహాలో కాకుండా ఎటువంటి అంశంపైన అయినా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తుంది. హాట్ టాపిక్ అవుతుంది. అయితే ఇప్పుడు న్యూ ఇయర్ వేడుకలు కదా. అలాంటి వివాదాలను పక్కన పెట్టి తన చెల్లి ఇతర కజిన్స్ తో కలిసి మారిషస్ దేశానికి పయనమైంది.

నూతన సంవత్సర వేడుకల ను రెండు రోజుల ముందు నుంచే మొదలు పెట్టింది. తాజాగా మారిషస్ లోని ఒక బీచ్ దగ్గర తన గ్యాంగ్ తో కలిసి సరదా గా గడుపుతూ కొన్ని ఫోటోలు తీయించుకుంది. ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేస్తూ “ఇది గమ్యం కాదు.. ప్రయాణం” అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది. మరో ఫోటోకు “తుఫాను మమ్మల్ని తాకక ముందు” అంటూ మరో క్యాప్షన్ ఇచ్చింది. అంటే ఇంకా పార్టీల హంగామా షురూ కాలేదన్న మాట. న్యూ ఇయర్ పార్టీలు ఎలా ఉంటాయో చెప్తే కొందరు సంప్రదాయవాదుల మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి వాటిని ఎక్కువగా వివరించనక్కర లేదు. ఒక్కసారి కనుక పార్టీ స్టార్ట్ అయి పీక్స్ లోకి పోతే తుఫాను ఏం ఖర్మ.. సునామీ.. భూకంపం లాంటి విపత్తులు అన్నీ ఒకేసారి కట్టకట్టుకొని జాయింటుగా వచ్చే అవకాశం ఉంది. ఏం చేస్తారో ఏం జరుగుతుందో అనే స్పృహ ఉండదు. ఇహం పరం అన్నీ ఒకేసారి ఆ క్షణంలోనే కనిపించే అవకాశం ఉంటుంది. ఇవన్నీ అలవాటైన ఆధునిక సమాజపు తత్వవేత్తలు ఈ హంగామా ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు కానీ మిగతా వారికి మాత్రం ఇవి మింగుడు పడని విషయాలే.

ఈ ఫోటోలలో తాప్సి.. తాప్సీ చెల్లి.. ఇతర కజిన్స్ ఉన్నారు. రెడ్ కలర్ టాప్.. రెడ్ కలర్ స్కర్ట్ ధరించి తాప్సీ సూపర్ మోడరన్ గా ఉంది. తాప్సీ చెల్లి శగున్ పన్ను కూడా వైట్ టాప్.. బ్లాక్ స్కర్ట్ ధరించి.. బ్లీచ్ హెయిర్ తో యమా స్టైలిష్ గా ఉంది. ఈ పన్ను సుందరీమణులు మారిషస్ కు పార్టీ అంటే ఏంటో చూపించి మరీ ఇండియాకు తిరిగి వచ్చేలా ఉన్నారు. అయినా వేడుకలు ఇప్పుడే ప్రారంభం అయ్యాయి. ఇక వరసగా మారిషస్ నుంచి నుంచి ఫోటోలు వస్తూ ఉంటాయి. గెట్ రెడీ గైస్.. !
Please Read Disclaimer