బ్యూటిఫుల్ బాలీవుడ్ స్టూడెంట్

0

అదేంటో ఇన్స్టాగ్రామ్ అంతా ముప్పై నలభై వయసు భామల హంగామా ఎక్కువగా ఉంది.. బీచుల్లో అందాలను ఆరేస్తూ.. బికినీలతో రచ్చ చేస్తూ.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. కానీ ఇరవైల భామల హంగామా తక్కువే ఉంది. ఈ ఏజ్ గ్రూప్ భామలు తక్కువ మంది మాత్రమే ఇలా ఇన్స్టాగ్రామ్ తాట తీసే కార్యక్రమాలు టేకప్ చేస్తున్నారు. 23 ఏళ్ళ భామ తారా సుతారియా ఇప్పుడిప్పుడే ఈ హాటు ఉద్యమంలో బుడిబుడినడకలు వేస్తోంది.

బాలీవుడ్ సినిమాలను ఫాలో అయ్యేవారికి తారా సుతారియా పేరు తెలిసే ఉంటుంది. కరణ్ జోహార్ స్కూల్ నుంచి బాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయిన భామ తార. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ ఈ భామ మొదటి సినిమా. ఈ భామ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటోంది. తాజాగా తార తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఇదేమీ బికినీ కాదు కానీ బ్యూటిఫుల్ గా ఉంది. ఈ ఫోటోకు “అందం అనేది లోపల నుంచి వచ్చే ఒక డ్యాన్స్. నాట్యం అనేది మన గురించి మనం తెలుపుకునే ఒక సాధనం. అది నాలోని అంతః శక్తిని.. నమ్మకాన్ని బయటకు తీసుకొచ్చి నాలో ఇంత శక్తి ఉందా అనిపించేలా చేస్తుంది. నేను చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాననే ఫీల్ ఇస్తుంది. మీరు గుర్తుంచుకోండి.. మీరు అందంగా ఉన్నారు. #కాన్ఫిడెంట్ బ్యూటీ” అంటూ ఓ పెద్ద క్యాప్షన్ ఇచ్చింది.

ఈ ఫోటోలో రెడ్ కలర్ స్లీవ్ లెస్ గౌన్ లో డ్యాన్స్ వేస్తూ ఒక సూపర్ పోజిచ్చింది. మొహంపై పడిన వెంట్రుకలు.. ఆ స్మైల్ అదిరిపోయింది. నెటిజన్లకు కూడా ఈ ఫోటో తెగ నచ్చింది. “రెడ్ హాట్ బ్యూటీ”.. “బ్యూటీ ఆఫ్ ది ఇయర్” .. “సో సో బ్యూటిఫుల్”.. “స్టన్నింగ్ డ్రెస్.. సూపర్ పోజ్’ అంటూ కామెంట్లు పెట్టారు. తారా సుతారియా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ప్రస్తుతం ‘మర్జావా’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
Please Read Disclaimer