థై షోలతో తారా మడతకాజా

0

ఎంతగా చిట్టి పొట్టి దుస్తుల్లో కనిపిస్తే అంతగా మైలేజ్ పెరుగుతుంది. యువతరంలో రెగ్యులర్ గా హాట్ టాపిక్ అవ్వాలంటే ఈ తరహా షో తప్పనిసరి. గ్లామర్ అండ్ గ్లిజ్ ప్రపంచంలో కథానాయికలు ఎవరికి వారు తమ ప్రత్యేకతను చాటుకుంటూనే నిరంతరం ఏదో ఒక హాట్ షో ఇవ్వాల్సిందే.

ముఖ్యంగా డెబ్యూ నాయికలు ఈ విషయంలో ఎంతో జోరుమీదుంటారు. కుర్రకారు కళ్లు తిప్పుకోనివ్వని లాజిక్ ని మ్యాజిక్ ని ఫాలో చేస్తుంటారు. ఇదిగో కరణ్ జోహార్ పరిచయం చేసిన సుందరి. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రంతో బాలీవుడ్ కి పరిచయం అయిన తారా సుతారియా కెరీర్ ఆరంభమైంది మొదలు నిరంతరం ఏదో ఒక వేడెక్కించే షోతో హాట్ టాపిక్ గా మారుతోంది. తొలి సినిమా మిశ్రమ ఫలితాన్ని అందించినా కానీ ఈ అమ్మడికి అవకాశాలకు కొదవేమీ లేదు.

ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రా సరసన `మర్జావాన్` చిత్రంలో నటించింది. మిలాప్ జవేరీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా త్వరలో భారీగా రిలీజవుతోంది. ఈ సందర్భంగా తారా సుతారియా ప్రచార కార్యక్రమాలతో వేడి పెంచేస్తోంది. తాజాగా వైట్ అండ్ వైట్ స్కర్ట్ లో ప్రత్యక్షమైన తారా ఓ వేడుకలో సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. స్కర్టులో థై షోలతో జనం కళ్లు తనవైపు తిప్పేసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతున్నాయి.
Please Read Disclaimer