పవన్ సినిమా ఫిక్స్ అంటున్న తరణ్ ఆదర్శ్

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా గురించి గత కొన్ని రోజులుగా ఎన్నో ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే వాటిలో ఏది నిజం.. ఏది ఊహాగానం అనేది ఎవరికీ తెలియడం లేదు. అయితే పవన్ నెక్స్ట్ సినిమా విషయంలో అధికారిక ప్రకటన వచ్చేసినట్టే. ఎందుకంటే ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పవన్ కళ్యాణ్ సినిమా కొత్త విషయాన్ని ఖరారు చేశారు.

ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ‘పింక్’ సినిమా రీమేక్ ను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుతో కలిసి నిర్మిస్తున్నారని.. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తారని వెల్లడించారు. ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తాడని తెలిపారు. పక్కా సమాచారం ఉంటే తప్ప తరణ్ ఆదర్శ్ ఇలాంటి వార్తను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చెయ్యరు. దీంతో పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సినిమా ఫిక్స్ అయిపోయిందని అనుకోవాలి.

బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘పింక్’ సినిమాకు అనిరుద్ధ రాయ్ దర్శకుడు. ఈ సినిమాకు షుజిత్ సర్కార్ కథ అందించారు. అమితాబ్ బచ్చన్.. తాప్సీ పన్ను.. కీర్తి కుల్హారి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను బోనీ కపూర్ తమిళంలో అజిత్ కుమార్ తో ‘నేర్కొండ పార్వై’ పేరుతో రీమేక్ సినిమాను నిర్మించగా ఘన విజయం సాధించింది. దీంతో ఇప్పుడు తెలుగులో పవన్ కళ్యాణ్ తో నిర్మిస్తున్నారు.
Please Read Disclaimer