నాకు ఆ కారుకు సంబంధం లేదు

0

ఈ మధ్య యంగ్ హీరోలు వరుసగా గాయపడుతూ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తరుణ్ కూడా అనుకోకుండా అలాగే వార్తల్లో నిలిచాడు. మీడియలో నటుడు తరుణ్ కారుకు యాక్సిడెంట్ అయిందనే వార్త చక్కర్లు కొడుతోంది. యాక్సిడెంట్ అనంతరం తరుణ్ వేరె కారులో వెళ్లినట్లు బాగా గాయపడినట్లు కొన్ని చానెల్స్ కూడా వార్తలు టెలికాస్ట్ చెస్తున్నాయి.

అందరూ తరుణ్ కి ఏమయిందంటూ షాక్ అవుతున్నారు కూడా. ఇంతకీ తరుణ్ కి ఎలాంటి యాక్సిడెంట్ జరగలేదు. ఈ వార్తపై తరుణ్ కూడా స్పందించాడు. తనకు యాక్సిడెంట్ జరిగిందనే వార్త అవాస్తవమని – యాక్సిడెంట్ అయిన కారుకు తనకు ఎటువంటి సంబందం లేదని – రాత్రి నుంచి తను ఇంటి వద్దే ఉన్నానని. తన కారు కూడా ఇంట్లోనే ఉందని చెప్పుకున్నాడు తరుణ్.

నిజానికి యాక్సిడెంట్ జరిగిన కారు యంగ్ హీరో రాజ్ తరుణ్ ది. రాజేంద్ర నగర్ సమీపంలో అదుపు తప్పి యాక్సిడెంట్ కి గురైంది. అయితే రాజ్ తరుణ్ పేరు కి బదులు తరుణ్ పేరు బయటికి వచ్చింది. అలా రాజ్ తరుణ్ కారు యాక్సిడెంట్ లో అనుకోకుండా ఒకప్పటి లవర్ బాయ్ పేరు మీడియాలో చక్కర్లు కొట్టింది. రోజు ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. ఆ వార్తలు మీడియాలో వస్తుంటాయి. కానీ సెలెబ్రిటీ కి యాక్సిడెంట్ అనగానే మీడియాలో స్పెషల్ ఫోకస్ ఉంటుంది. ప్రేక్షకులు ఆసక్తికరంగా వార్తను చూస్తారు. ఇప్పుడు తరుణ్ విషయంలో కూడా అదే జరిగింది. ఏం జరిగిందో తెలుసుకోకుండా జనాలు కూడా అదే నిజమనుకున్నారు.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home