టాక్సీవాలా బ్యూటీ.. ఆలా జరిగిందట!

0

‘టాక్సీవాలా’ తో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ప్రియాంక జవాల్కర్. మొదటి సినిమాతోనే విజయ్ దేవరకొండ లాంటి సెన్సేషనల్ హీరోతో జోడీ కట్టడం ఒక లక్ అయితే.. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఇక ప్రియాంక కెరీర్ కు తిరుగులేదని.. దూసుకుపోతుందని అనుకున్నారు కానీ అలా ఏమీ జరగలేదు. మంచి ప్రాజెక్ట్ కోసం ఇంకా వెయిట్ చేస్తూనే ఉంది.

రీసెంట్ గా అఖిల్ అక్కినేని నాలుగో చిత్రానికి హీరోయిన్ గా ప్రియాంక జవాల్కర్ పేరును పరిశీలిస్తున్నారని అన్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మించనున్న ఈ సినిమా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తాడని సమాచారం. కానీ ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక ను తీసుకోవడం లేదని.. మరో హీరోయిన్ కోసం వెతుకుతున్నారని టాక్ వినిపిస్తోంది. సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా అంటే ఎప్పుడైనా ఒక లక్కీ ఛాన్సే. మరి ఆ ఛాన్స్ ప్రియాంకకు ప్రస్తుతానికి మిస్ అయినట్టే.

‘టాక్సీవాలా’ తర్వాత ప్రియాంకకు కొన్ని ఆఫర్లు వచ్చినా ఆ సినిమాలు పెద్దగా ఎగ్జైటింగ్ గా లేకపోవడంతో రిజెక్ట్ చేసిందట. ఇప్పుడేమో అఖిల్ సినిమా కూడా మిస్ అయింది. మరి ఈ ‘టాక్సీవాలా’ బ్యూటీకి ఎవరు క్రేజీ ఆఫర్ ఇస్తారో వేచి చూడాలి. తెలుగు చక్కగా మాట్లాడడమే కాకుండా గ్లామరస్ గా ఉండే అనంతపూర్ అమ్మాయికి ఆఫర్లు రాకపోవడం చిత్రమే. ఇలా కనుక ఆఫర్లు ఇవ్వకుండా ఉంటే అనంతపూర్ బ్యూటీ సోషల్ మీడియాలు హీటు పెంచుతుంది.. జాగ్రత్త!
Please Read Disclaimer