అబ్బాయితో.. వాటంగా కుదిరిందిలే

0

అబ్బాయి.. అమ్మాయి.. మాంచి వేడి మీద ఉన్నారు. లవ్వు గివ్వు అంటూ వెంటపడ్డ ఆ కుర్రాడి ముందు అమ్మాయి గారు ఎంత బెట్టు చేసినా కానీ అదంతా చివరికి ప్రేమ యవ్వారమేనని ఇదిగో ఈ ఫోటో చూస్తే అర్థమవుతోంది. ఇలా ఒకసారి కనెక్టయిపోయాడో లేదో అలా ఆ కుర్రాడితో ఎంతగా ఒదిగిపోయిందో. కౌగిలింతలు గిలిగింతలు కొంటె వ్యవహారాలకు కొదవేమీ లేదు.

మాంచి ఊపు మీద తొలి సింగిల్ తో ఫ్యాన్స్ ని కవ్వించేందుకు వస్తున్నారు కాబట్టి ముందస్తుగా ఇలా గ్లింప్స్ ని రిలీజ్ చేశారని అర్థమవుతోంది. డ్యాన్స్ ఫ్లోర్ పై నితిన్ స్పీడ్ గురించి చెప్పాల్సిన పనేలేదు. అందాల రష్మికతో ఎంతో ఇదిగా కమిటైపోయినట్టే కనిపిస్తున్నాడు. దూకుడున్న పుంజు దుందుడుకు వ్యవహారంలా ఉంది మరి. ఇప్పటివరకూ రిలీజైన ప్రమోషనల్ మెటీరియల్ చూస్తే నితిన్ నుంచి మరో క్లాసిక్ లవ్ స్టోరీని ఆశించవచ్చు. రష్మికతో నితిన్ కి ఓ రేంజులో కుదిరింది. ఈ జోడీ పిక్చర్ పర్ఫెక్ట్ అనేస్తే తప్పేమీ కాదు.

త్వరలో పెళ్లికి సిద్ధమవుతున్న నితిన్ కి ఇంత అందమైన పెయిర్ దొరికిందో లేదో తెలీదు కానీ.. రష్మిక మాత్రం పర్ఫెక్ట్ జోడీగా కనిపిస్తోంది. అంతగా ఆ ఇద్దరూ ఒదిగిపోయారు పాత్రల్లోకి. ఇప్పటివరకూ వచ్చిన పోస్టర్లు.. టీజర్ ప్రతిదీ సినిమాపై ఆసక్తిని పెంచాయి. సింగిల్స్ ఆంథెమ్ కి అద్భుత స్పందన వచ్చింది. తాజాగా భీష్మ పాటల ప్రమోషన్ మొదలైంది. తొలి సింగిల్ వాటే బ్యూటీ.. ఈనెల 31న రిలీజ్ కానుంది. ఇప్పుడు వాటే బ్యూటీ అంటూ రొమాంటిక్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 21న సినిమా రిలీజ్ కానుంది. అప్పటివరకూ ఈ ట్రీట్ కొనసాగుతుందిట. `ఛలో` ఫేం వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది.
Please Read Disclaimer