నాటీ టీచర్ పోస్టర్ తో సరేనా?

0

ఇమేజ్ ని బట్టి ట్రీటుంటుంది టాలీవుడ్ లో. ఇది ఇప్పుడే కాదు.. ఎప్పుడూ చూస్తున్నదే. ఫస్ట్ హీరోయిన్ .. సెకండ్ హీరోయిన్ అంటూ విడివిడిగా చూస్తుంటే కొందరు కథానాయికలు దానిని తట్టుకోలేని సన్నివేశం ఉంటుంది. ఇంతకుముందు రిచా గంగోపాధ్యాయ్ లాంటి నటి ఈ విషయంలో మీడియా ముందే బరస్ట్ అయ్యింది. సెకండ్ హీరోయిన్ .. ఫస్ట్ హీరోయిన్ అని రాస్తుంటారు.. అది మీవరకే పరిమితం అనేసింది ఇంటర్వ్యూలో. వాస్తవానికి కథానాయిక స్టార్ డమ్ ఇమేజ్ ని బట్టి ఇక్కడ రాత ఉంటుంది. అందుకు తాజా ఎగ్జాంపుల్ పాయల్ రాజ్ పుత్.

ఈ అమ్మడికి తొలి ప్రయత్నం ఆర్.ఎక్స్ 100తో వచ్చిన ఇమేజ్ ఎలాంటిదో తెలిసిందే. హాట్ బాంబర్ అంటూ అభిమానులు కంటికి కునుకులేకుండా అయిపోయారు. అయితే ఆ ఇమేజ్ ఇప్పటికీ పాయల్ ని వెంటాడుతోంది. ఆర్.ఎక్స్ 100 తరువాత చేసిన `ఆర్.డి.ఎక్స్ లవ్` చిత్రం పాయల్ కు ఆశించిన ఫలితాన్ని అందించకపోగా అతి పెద్ద డ్రాబ్యాక్ అయ్యింది. ఆ చిత్రం తన క్రేజును ఒక కోణంలో మసకబారేలా చేసింది. దాంతో ఆమెతో సినిమాలు చేస్తున్న వారు సినిమా ప్రచారంలో ఆమె ప్రాధాన్యతను తగ్గిస్తున్నారని అర్థమవుతోంది. సినిమా రేంజును బట్టి పాయల్ ని దాచేస్తుండడం బయటపడింది.

పాయల్ చేతిలో ప్రస్తుతం రెండు భారీ చిత్రాలున్నాయి. అందులో ఒకటి సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న `వెంకీ మామ`. మాస్ మహరాజా నటిస్తున్న `డిస్కోరాజా`. ఈ రెండు చిత్రాల్లో పాయల్ సెకండ్ లీడ్ క్యారెక్టర్ లే చేస్తోంది. ఈ నెల 13న `వెంకీమామ` రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ప్రమోషన్స్ని చిత్ర బృందం మొదలుపెట్టింది. అయితే దానికి పాయల్ ని దూరంగా వుంచడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇదే చిత్రంలో నటించిన రాశిఖన్నాకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఆమె పుట్టిన రోజుకు స్పెషల్ టీజర్ ని కట్ చేసి హంగామా చేసిన చిత్ర బృందం పాయల్ పుట్టిన రోజుకు మాత్రం పోస్టర్ తో సరిపెట్టేయడం పరిశ్రమలో చర్చకు వచ్చింది. ఇకపోతే తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో పాయల్ ఇమేజ్ కి తగ్గట్టే హాట్ గా ఎలివేట్ చేశారు. ఒక చేతికి బెల్టు వాచీ.. ఇంకో చేతికి కంకణం గాజులు.. యూత్ మెచ్చే పెప్పీ ఉంగరం.. ఇంతగా ప్రిపైరే క్లాస్ చెప్పడానికి వెళుతున్న టీచరమ్మలా ఓహో అనిపించేస్తోంది. స్లీవ్ లెస్ జాకెట్.. వేడెక్కించే చీరలో నాటీ టీచర్ లా కనిపిస్తోంది. అసలు పెళ్లి వద్దు అనుకున్న మామను తన వెంట పడేలా చేసిన నాటీ గాళ్ గా పాయల్ ఈ చిత్రంలో కనిపించబోతోందట.
Please Read Disclaimer