టీజర్ పోస్టర్: అల్ట్రా స్టైలిష్ బాలయ్య

0

నందమూరి బాలకృష్ణ హీరోగా కె యస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రూలర్’. ఈ సినిమాలో బాలయ్య రెండు భిన్నమైన గెటప్స్ లో కనిపిస్తున్నారు. అందులో ఐరన్ మ్యాన్ తరహా లో గడ్డంతో ఒక క్లాస్ లుక్.. మరో గెటప్ లో ఫుల్ గా గడ్డం పెంచి పోలీస్ ఆఫీసర్ గా రఫ్ గా కనిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ విషయాన్ని వెల్లడిస్తూ కొత్త పోస్టర్ విడుదల చేసింది రూలర్ టీం.

‘టీజర్ సూన్’ అంటూ త్వరలో బాలయ్య టీజర్ తో ప్రేక్షకులకు ట్రీట్ ఇవ్వబోతున్నారని వెల్లడించారు. అయితే టీజర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది రివీల్ చెయ్యలేదు. ఈ పోస్టర్ లోనే డిసెంబర్ 20 న ‘రూలర్’ రిలీజ్ అవుతుందని మరోసారి ధృవీకరించారు. ఇక పోస్టర్ విషయానికి వస్తే.. బాలయ్య ఐరన్ మ్యాన్ గెటప్ లో ప్రింటెడ్ షర్టు.. వైట్ స్ట్రైప్ ఉండే జీన్స్ ధరించి స్టైలిష్ గా ఉండే ప్రయత్నం చేశారు. బాలయ్య ధరించిన షూ కూడా వెరైటీగా ఉంది. బాలీవుడ్ స్టార్ షారూఖ్ తరహాలో రెండు చేతులు చాపి ఏదో డ్యాన్స్ స్టెప్ వేస్తున్నట్టుగా ఉంది. ఈ పోస్టర్ లో బాలయ్య స్టైలిష్ గానే ఉన్నారు. ఇక మరో అంశం.. స్లిమ్ గా కూడా కనిపిస్తున్నారు.

ఈ సినిమాలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్.. వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ మరో కీలక పాత్ర లో నటిస్తున్నారు. చిరంతన్ భట్ ఈ చిత్రానికి సంగీతం దర్శకుడు. ఈ సినిమాను హ్యాపీ మూవీస్ బ్యానర్ పై సీ. కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ‘జైసింహా’ లాంటి హిట్ తర్వాత బాలయ్య-కెయస్ రవికుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఈ సినిమా విజయం పై నందమూరి అభిమానులు నమ్మకంగా ఉన్నారు.
Please Read Disclaimer