టీజర్ టాక్: భీష్మ

0

నితిన్- వెంకీ కుడుముల కాంబినేషన్ లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ”భీష్మ’. ఈ సినిమాకు ట్యాగ్ లైన్ ‘సింగిల్ ఫరెవర్’. కాసేపటి క్రితం ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. జస్ట్ 30 సెకన్లే ఉన్న ఈ ఫస్ట్ గ్లింప్స్ లో స్టొరీ ఏమీ రివీల్ చెయ్యలేదు కానీ ఒక రొమాంటిక్ సీన్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

అందమైన పింక్ చీర కట్టుకుని అలా వయ్యారంగా రష్మిక నడుచుకుంటూ పోతుంటుంది. వెనకాలే ‘ఐ వానా వానా ఫాలో ఫాలో యూ’ అన్నట్టుగా సూటు బూటులో నితిన్ భయ్యా వెనకాలే ఒక మిషన్ తో నడుస్తుంటాడు. ఆ మిషన్ ఏంటో నితిన్ భయ్యా కళ్ళ విజన్ లోనే మనకు తెలుస్తూ ఉంటుంది. పైగా దాన్ని సాధించడం కోసం రెండు చేతులను రెడీగా పెట్టుకుని మరీ నడుస్తుంటాడు. ‘నా లవ్ కూడా విజయ్ మాల్యా లాంటిదిరా.. కన్పిస్తుంటది కానీ క్యాచ్ చెయ్యలేం’ అంటూ రష్మిక నడుమును వెరైటీగా విజయ్ మాల్యాతో పోల్చాడు! ఏ నడుము సీన్ చూసినా తెలుగు ప్రేక్షకులకు ‘ఖుషి’ సినిమాలో పవన్-భూమిక సీనే గుర్తొస్తుంది. భీష్మ నడుము సీన్ ఫన్నీగా అనిపిస్తోంది కానీ మరీ ఇంప్రెసివ్ గా అయితే ఏమీ లేదు.

పక్కింటి అమ్మాయి తరహాలో ఉండే రష్మిక గ్లామర్ ఇమేజ్ కోసం.. మాస్ హీరోయిన్ ఇమేజ్ కోసం ప్రయత్నం చేస్తోంది కానీ పెద్దగా సెట్ కావడం లేదు. గ్లింప్స్ పేరుతో నడుము అందాలను చూపించాలని ట్రై చేసినా ఆ రొమాంటిక్ ఎఫెక్ట్ అయితే రాలేదు. ఈ టీజర్ లో ఇంట్రెస్టింగ్ గా అనిపించిన మరో అంశం మహతి స్వరసాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. విజువల్స్ కూడా బాగున్నాయి. ఆలస్యం ఎందుకు.. రొమాంటిక్ నితిన్ ని చూసేయండి.
Please Read Disclaimer