టీజర్ టాక్: సైకో

0

ఉదయనిధి స్టాలిన్.. నిత్యా మీనన్.. అదితి రావ్ హైదరీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం ‘సైకో’. మిస్కిన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ను రీసెంట్ గా మణిరత్నం విడుదల చేశారు. టైటిల్ లోనే ఈ సినిమా ఒక క్రైమ్ థ్రిల్లర్ అనే విషయం తెలిసిపోతోంది కదా. దానికి తగ్గట్టే ఈ సినిమా ఎలా ఉంటుందో టీజర్ లో శాంపిల్ చూపించారు.

ఈ సినిమాలో ఉదయనిధి ఒక అంధుడి పాత్రలో నటిస్తున్నాడు. టీజర్లో నగ్నంగా నిలుచుని ఉండే ఒక వ్యక్తి.. ఓ క్రైమ్ సీన్.. సైకో నుంచి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తి.. ఇలా కొన్ని అంశాలు చూపించారు. చదివేందుకు ఇవి మామూలుగా అనిపిస్తాయి.. కానీ వీటిని ఇళయరాజా నేపథ్యం సంగీతంతో డార్క్ విజువల్స్ తో చూస్తే మాత్రం అచ్చమైన తమిళ సైకో సినిమాను చూస్తున్నట్టే ఉంటుంది. సాధారణ వ్యక్తులకు కాస్త భయం కూడా వేస్తుంది. ఈ టీజర్ ను చూస్తే మాత్రం మలుపులతో కూడిన గ్రిప్పింగ్ థ్రిల్లర్ అనిపిస్తుంది. ఇళయరాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటుగా తన్వీర్ మిర్ ఛాయాగ్రహణం కూడా సూపర్ గా ఉంది.

క్రైమ్ సినిమాలో రక్తం ఉండకూడదు.. హింస ఉండకూడదు.. సైకోల మీద సినిమాలేంటి? అనే ఫిలాసఫీ ఫాలో అయ్యే సంప్రదాయవాదులు కాకుండా క్రైమ్ థ్రిల్లర్స్ చూసేవారికి తప్పనిసరిగా నచ్చేలా ఉంది. ఈ సినిమా టీజర్ కంటే ‘సైకో’కి సంబంధించిన మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఈ సినిమాను నిర్మించిన బ్యానర్ పేరు.. డబల్ మీనింగ్ ప్రొడక్షన్స్ అంట! ఇక ఆలస్యం ఎందుకు.. చూసేయండి. ‘ఇస్మార్ట్ శంకర్’ టీజర్ కు హెడ్ ఫోన్స్ అవసరం లేదని పూరి గారు చెప్పారు కానీ ఇలాంటి సైకో సయ్యా టీజర్లకు హెడ్ ఫోన్స్ అవసరమే. లేకపోతే ఆ కాస్త కూడా భయపడరు.
Please Read Disclaimer