కన్నీళ్లు పెట్టించిన సావిత్రి రియల్ స్టోరీ!

0

హుషారు పుట్టిస్తూ.. చలాకీగా మాట్లాడే సావిత్రి అక్కగా తెలుగు ప్రజలకు సుపరిచితురాలైన శివజ్యోతి తాజాగా బిగ్ బాస్ షోలో ఎంట్రీ ఇవ్వటం తెలిసిందే. గలగల మాట్లాడే సావిత్రి ఎక్కడుంటే అక్కడ సందడి అన్నట్లు ఉండే ఆమె.. తాజా ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ తో పాటు.. షోను చూస్తున్న ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించింది.

ఆమె తన లైఫ్ గురించి చెప్పిన వైనంతో సావిత్రి మీద రెస్పెక్ట్ మరింత పెరగటమే కాదు.. జీవితంలో ఇన్ని సవాళ్లు ఎదుర్కొందా? అన్న భావన కలిగేలా చేసింది. వీకెండ్ కావటంతో నాగ్ ఎంట్రీతో కాస్తంత రిలీఫ్ తో పాటు.. జోష్ పెరగ్గా.. ఇంట్లో ఏం జరుగుతుందో అంటూ ప్రేక్షకులతో పాటు చూసిన నాగ్.. మధ్య మధ్యలో తన వ్యాఖ్యానాలతో ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా శివజ్యోతి తన ప్రేమకథను కొందరు హౌస్ మేట్స్ తో షేర్ చేసుకుంటున్న వైనాన్ని ప్రేక్షకులతో కలిసి నాగ్ చూశారు. ఈ సందర్భంగా శివజ్యోతి తన రియల్ స్టోరీతో కన్నీళ్లు తెప్పించారు. పందొమ్మిదేళ్లకే ఇంట్లో నుంచి బయటకు వచ్చేయటం.. ప్రేమ వ్యవహారం గొడవలు.. భర్త కష్టపడి పోషించటం.. తన తండ్రి బాధ్యతారాహిత్యంగా ఉండే తీరు.. కుటుంబ పరిస్థితి.. తానెంత కష్టంలో ఉండేదన్న విషయాల్ని చెప్పుకొచ్చే మాటలతో హౌస్ మేట్స్ కన్నీరు పెట్టేశారు.

చివరకు తాను ఉద్యోగం (రిసెప్షనిస్ట్) చేస్తూ భర్తను చదివించానని.. తన తండ్రి చిన్నతనంలో కుటుంబాన్ని పట్టించుకునే వారు కాదని.. అయితే చివరి రోజుల్లో మాత్రం తన తండ్రిని తన దగ్గరే ఉంచుకున్నానని.. నిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించినట్లు చెప్పారు.

టాప్ యాంకర్ గా పేరున్న శివజ్యోతి వెనుక మనసు కదిలిపోయే ఇలాంటి గతం ఉండటం ప్రతి ఒక్కరిని అయ్యో అనుకునేలా చేసింది. అదే సమయంలో తన భర్త తనను ఎంత అపురూపంగా చూసుకునే వారన్న విషయం సావిత్రి మాటల్లో విన్న వారికి.. ఇవాల్టి రోజుల్లో భార్యభర్తల మధ్య ఉండాల్సిన అనురాగం.. అనుబంధం గురించి తెలిసేలా చేసిందని చెప్పాలి.

దీనికి తగ్గట్లే నాగార్జున మాట్లాడుతూ.. షో తర్వాత భర్తల ట్రైనింగ్ సెంటర్ ను శివజ్యోతి దంపతులు కలిసి స్టార్ట్ చేస్తే మస్తు క్లిక్ అవుతుందంటే..అందుకు అంగీకరిస్తూ.. తాము డబ్బులు తీసుకోకుండా..తమ ఇంట్లోనే ఉంచుకొని ట్రైనింగ్ ఇస్తానని.. తిండి కూడా పెడతామని వ్యాఖ్యానించింది. శివజ్యోతి తన జీవితకథను చెప్పే క్రమంలో అషూ రెడ్డి కన్నీరు కార్చటాన్ని నాగ్ ప్రస్తావించారు. ఈ వారంలో హార్ట్ ను టచ్ చేసిన అంశాల్లో శివజ్యోతి జీవితంగా చెప్పక తప్పదు.
Please Read Disclaimer