బిగ్ బాస్ లో టాప్ పెయిడ్ కంటెస్టెంట్ గా ప్రియాంక మరిది..

0

బిగ్ బాస్ ..వరల్డ్స్ బిగెస్ట్ రియాలిటీ షో. ఈ బిగ్ బాస్ ప్రస్తుతం హిందీలో 13 వ సీజన్ జరుగుతుంది. ఈ షో కి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తున్నాడు. ఇక బిగ్ బాస్ అంటేనే వివాదం .. ఈ సీజన్ కూడా పలు వివాదాల నడుమే విజయవంతంగా ముందుసాగుతుంది. ఈ 13 వ సీజన్ లో ఇప్పటివరకు టాప్ పెయిడ్ కంటెస్టెంట్ గా రష్మీ దేశాయ్ ఉన్నది. కానీ తాజాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఈమె కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటూ సరి కొత్త రికార్డ్ సృష్టించాడు. ఆ కంటెస్టెంట్ స్వయానా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ కి వరుసకు మరిది కావడం మరో విశేషం.

అతను పేరు తెహ్సీన్ పూనా వాలా. వ్యాపారవేత్తగా సామాజిక హక్కుల కార్యకర్తగా పేరుపొందిన తెహ్సీన్ బిగ్బాస్ 13వ సీజన్ లో కి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఇతను ప్రియాంక మరిది అంటే ఎలా అని అనుకుంటున్నారా .. ప్రియాంక భర్త రాబార్డ్ వాద్రా కజిన్ అయిన మోనికా వాద్రాను తెహ్సీన్ వివాహం చేసుకున్నాడు. ఈ లెక్కన ప్రియాంక అతడు వరసకు ప్రియాంకకు మరిది అవుతాడు.

మహా రాష్ట్ర లోని పుణెలో 1981లో జన్మించిన తెహ్సీన్ కాంగ్రెస్ పార్టీ లో కూడా పనిచేస్తున్నారు. అదే సమయం లో రాహుల్ గాంధీ మీద తెహ్సీన్ విమర్శలకు కూడా వెనుకాడేవాడు కాదు. అదే ఇతని స్పెషాలిటీ. అంతేకాదు మహా రాష్ట్ర లో కాంగ్రెస్ మాజీ సెక్రటరీ సెహ్జాద్ పూనావాలాకు తెహ్సీన్ సోదరుడు కావడం విశేషం. ఇక రాజకీయ వ్యూహకర్తగానూ తెహ్సీన్ వ్యవహరిస్తున్నాడు.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home