మెగాస్టార్ తో తేజ ఆర్టికల్ 370 మూవీ?

0

విభిన్నమైన ప్రేమ కథలతో టాలీవుడ్ కు పలువురు నటీ నటులను గతం లో పరిచయం చేసి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను దక్కించుకున్న దర్శకుడు తేజ. గత దశాబ్ద కాలంగా ఈయన ప్రాభవం అంతగా కనిపించడం లేదు. మళ్లీ ఈమద్యే కాస్త సందడి చేస్తున్నాడు. ఇటీవల ఈయన కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన ‘ఆర్టికల్ 370’పై ఒక సినిమా ను చేసేందుకు సిద్దం అవుతున్నట్లు గా వార్తలు వస్తున్నాయి. ఒక ఆసక్తికరమైన స్టోరీ లైన్ ను ఇప్పటికే సిద్దం చేసుకున్నాడని త్వరలోనే పట్టాలెక్కించబోతున్నట్లు గా ప్రచారం చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ గోవా లో జరుగుతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇదే సమయంలో ఈ సినిమా స్టోరీ లైన్ ను బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ కు తేజ వినిపించాడని.. ఆయన స్టోరీ లైన్ కు ఇంప్రెస్ అయ్యి నటించేందుకు ఓకే చెప్పినట్లు గా సమాచారం అందుతోంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిన తర్వాత తన తుది నిర్ణయంను చెప్తానంటూ అమితాబ్ చెప్పాడని కూడా టాక్ వినిపిస్తుంది.

అమితాబ్ తో పాటు పలువురు ముఖ్య నటీనటులు మరియు కొందరు కొత్త వారు ఈ సినిమాలో నటించబోతున్నారు. బాలీవుడ్ లో కూడా ఆర్టికల్ 370కి సంబంధించిన సినిమాలు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి. త్వరలోనే అవి కూడా పట్టాలెక్కే అవకాశం ఉందంటున్నారు. వాటికంటే ముందే తేజ ఆర్టికల్ 370 మూవీ పట్టాలెక్కే అవకాశం ఉందంటున్నారు. నిజంగానే తేజ చేయబోతున్న ఈ సినిమాలో మెగాస్టార్ అమితాబ్ ఉంటే సినిమా స్థాయి అమాంతం పెరగడం ఖాయం.

తెలుగులో మాత్రమే కాకుండా హిందీ ఇతర భాషల్లో కూడా విడుదల చేసే అవకాశాలుంటాయి. తేజ ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ విషయమై సైలెంట్ గానే ఉన్నాడు. ఆయన ఎప్పుడు నోరు విప్పుతాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభం లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
Please Read Disclaimer